మధిర(Madhira)ను ఆధునిక వసతుల(Modern Facilities)తో ఆదర్శ నగరం(Ideal City)గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమ(Target)ని స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం(Deputy CM) మల్లు భట్టివిక్రమార్క(Mallu Bhattivikramarka) అన్నారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరల పంపిణీ(Distribution of Indiramma Sarees) జరుగుతుందని చెప్పారు. మధిర మునిసిపాలిటీ(Municipality) పరిధిలో ఒక్క రోజే 10,272 చీరలను పంపిణీ చేసినట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాల్లో చేరిన మహిళలకు వడ్డీ లేని రుణాలతోపాటు అనేక ఆర్థిక అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఏడాదిలో పూర్తి చేసి, అనంతరం పట్టణమంతటా కొత్త సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. ఈ పనుల వల్ల కలుగుతున్న కొద్దిపాటి అసౌకర్యాన్ని భవిష్యత్తు అభివృద్ధి కోసం సహనంతో భరించాలని కోరారు.
Bhatti | ఆదర్శ నగరంగా మధిర.. నా లక్ష్యం..
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
