స్పెయిన్ అధ్యక్షుడు(Spain President) పెడ్రో సాంచెజ్ పెరెజ్-కాస్టెజోన్(Pedro Sanchez Perez-Castejon) త్వరలో ఇండియా పర్యటన(India Tour)కు రానున్నారు. ఈ విషయాన్ని స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బారెస్ బుధవారం తెలిపారు. ప్రధాని మోదీ(PM Modi) కూడా స్పెయిన్ సందర్శనకు వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్(Jaishankar)తో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ అల్బారెస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండో-పసిఫిక్ మహాసముద్ర చొరవ(Indo-Pacific Ocean Initiative)లో చేరడానికి, యూరోపియన్ యూనియన్ ద్వారా ద్వైపాక్షికంగా పనిచేయడానికి స్పెయిన్ ఆసక్తిగా ఉందని చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా అప్‌గ్రేడ్ చేయాలని స్పెయిన్ ఆశిస్తున్నట్లు చెప్పారు.
