Wednesday, June 10, 2026
HomeజాతీయంBengaluru | బెంగుళూరులో అధిక జీవనవ్యయం..

Bengaluru | బెంగుళూరులో అధిక జీవనవ్యయం..

  • వైరల్ గా మారిన కార్పొరేట్ ఉద్యోగి పోస్ట్..
  • నెవారీ ఖర్చులు రూ. 43,000 అని వెల్లడి..

భారత్ టెక్ హబ్ బెంగళూరులో జీవనం వ్యయం ఏ స్థాయిలో ఉందో వివరిస్తూ ఒక కార్పొరేట్ ఉద్యోగిని ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తన నెలవారీ ఖర్చులు రూ. 43,000 అని 22 ఏళ్ల సానికా కులకర్ణి పేర్కొనడం, నగరంలో పెరుగుతున్న జీవన ప్రమాణాల వ్యయంపై సరికొత్త చర్చకు దారితీసింది.

“బెంగళూరులో జీవించడానికి నేను చేసే ఖర్చు” అనే శీర్షికతో సానికా తన వ్యయాల వివరాలను వెల్లడించారు. ఆమె తన సోదరితో కలిసి నగరంలోని ఒక ప్రధాన ప్రాంతంలో డబుల్ బెడ్రూం ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. ఆ ఫ్లాట్ మొత్తం అద్దె రూ. 38,000 కాగా, తన వాటాగా రూ. 19,000 చెల్లిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వ పథకం కారణంగా విద్యుత్ బిల్లు సున్నా అని పేర్కొన్నారు.

- Advertisement -

ఇక ఇంటి పనిమనిషి, నిత్యావసర వస్తువులకు కలిపి నెలకు రూ. 7,000, ప్రధానంగా ఆటో ప్రయాణాల కోసం రూ. 7,000 వెచ్చిస్తున్నట్లు వివరించారు. నగరంలో కేఫ్‌ కల్చర్ ఎక్కువగా ఉండటంతో బయట భోజనానికి రూ. 5,000, షాపింగ్ మరియు అప్పుడప్పుడు సొంత ఊరికి వెళ్లే ప్రయాణాల కోసం మరో రూ. 5,000 ఖర్చవుతున్నట్లు ఆమె లెక్క చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News