Thursday, February 12, 2026
Homeఆంధ్రప్రదేశ్Speakes Summit | శాసనసభాపతుల సదస్సుకు ఏపీ నుంచి హాజరు

Speakes Summit | శాసనసభాపతుల సదస్సుకు ఏపీ నుంచి హాజరు

86వ అఖిల భారత శాసన సభాపతుల సదస్సు(All India Conference Of Presiding Officers) ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AndhraPradesh Assembly Speaker) స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu), డిప్యూటీ స్పీకర్ (Deputy Speaker) రఘురామకృష్ణరాజు (Raghuramakrishnaraju) హాజరయ్యారు. ప్రజల పట్ల శాసన సభ జవాబుదారీతనం (Accountability Of Legislature Towards The People) అనే అంశంపై మాట్లాడారు. అసెంబ్లీకి రాకుండా, ఒక్క చర్చలో కూడా పాల్గొనకుండా వేతనాలు తీసుకుంటున్నవారిని నిషేధించే నిబంధనలు లేవని చెప్పారు. అందువల్ల ఈ మేరకు చట్ట సవరణ చేయాలని, సభకు రాని సభ్యులకు ‘నో వర్క్.. నో పే’ రూలు పెట్టాలని సూచించారు. అలాంటి ఎమ్మెల్యేలను రీకాల్ చేసే హక్కును ప్రజలకు ఇవ్వాలని కోరారు. సభకు రాకుండా జీతాలు తీసుకోవటం సమర్థనీయం కాదని అభిప్రాయపడ్డారు. ఆ సభ్యులను చూస్తుంటే ఆవేదన కలుగుతోందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News