పురపాలక ఎన్నికలు రాబోతున్నాయి.. దేశం – రాష్ట్రాల అభివృద్ధికి పట్టణాలు, నగరాలు, మహానగరాలే ప్రధాన ఇంధన వనరులు. కానీ పెరిగిపోతున్న పట్టణీకరణతో రేపటి మనుగడ ఎలా?. ఉద్యోగం, ఉపాధి, విద్య, వైద్యం, వ్యాపారం అన్నీ పట్టణాల చుట్టూనే తిరుగుతున్నాయి.. అందుకే ప్రజల వలసలు ఊపిరి పీల్చుకోనంతగా నగరాల వైపు సాగుతున్నాయి.. నగరాలు ఉపాధి ఇస్తాయి.. కానీ వాటిని కాపాడే పాలన లేకపోతే, రేపటి మనుగడే ప్రమాదంలో పడుతుంది.. వరదలు ముంచెత్తుతాయి.ఎండలు మండిపోతాయి, కాలుష్యం ఊపిరాడనివ్వదు. కావున అన్ని రాజకీయ పార్టీలు భవిష్యత్ తరాల మనుగడకు దోహదపడే స్పష్టమైన ఎన్నికల మేనిఫెస్టోతో ముందుకు రావాలి. ఇచ్చిన మాటపై నిలబడే వారిని ప్రజలు జాగ్రత్తగా పరిశీలించాలి. లేదంటే మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కున్నట్లే అవుతుంది..
- మేదాజీ
