కూల్చివేతకు అనుమతులు ఉన్నాయా..?
- కన్యకా పరమేశ్వరి దేవస్థానం అక్రమంగా కూల్చివేత..
- కాసుల కోసమే మూడు ఇల్లీగల్ కమిటీలు చేసిన దుర్మార్గం.
- ఎండోమెంట్ ఫస్లీలో రిజిస్టర్ చేయబడ్డ దేవాలయం..
- అత్యంత పురాతన దేవాలయంపై కన్నేసిన కొందరు దుర్మార్గులు..
- నిధి కోసం ఆరాటం..? పురాతన దేవాలయం అనేది కారణం..
- దీనిని బూచిగా చూపి మహిమాన్విత ఆలయం ధ్వంసం..
- దేవాలయం కోసం పోరాడుతున్న నాగిండ్ల శ్రీనివాస్..
- అనుమతులు లేకుండా నిర్మాణం చేస్తున్న చర్యలు చేపట్టని అధికారులు..
- ప్రభుత్వం దష్టి సారించాలని డిమాండ్ చేస్తున్న నాగిండ్ల శ్రీనివాస్..
దుర్మార్గులకు దైవం అనే ధ్యాస ఉండదు.. పాప భీతి అసలే ఉండదు.. వీరికి చట్టాలు, నిబంధనలు అనే పదాలకు అర్ధం తెలియదు.. కేవలం అక్రమార్జన ఏ రూపంలో వస్తుందా..? అని ఆలోచిస్తుంటారు.. ఈ కోవకి చెందిన కొందరు ముష్కరులు ఎంతో పవిత్రమైన, పురాతన. అమ్మవారి దేవాలయంపై వీరి కన్ను పడింది.. అక్కడ వెలకట్టలేని నిధి నిక్షేపాలు ఉన్నాయని భావించారు.. ఇంకేముంది ఆ ఆలయాన్ని ధ్వంసం చేశారు.. ఆ వివరాలు విÖ కోసం..
సికింద్రాబాద్ లో వెలసిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం.. అక్కడి ఆవులమంద శివారు ప్రాంతంలో నెలకొని ఉంది.. ఈ అమ్మవారు ఆర్యవైశ్యుల కులదేవత.. ఈ దేవస్థానం బుక్ ఆఫ్ ఎండోమెంట్లు 1356 ఫసలీ లో రిజిస్టర్ చేయబడింది. అత్యంత పురాతనమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది.. దురదష్టం ఏమిటంటే నిధి కోసం కొంతమంది ఇల్లీగల్ గా మూడు కమిటీలు ఏర్పరచుకొని ఈ దేవస్థానంపైన అధిపత్యం చెలాయిస్తున్నారనే ఆరోపణలు ఈ ప్రాంతంలో బలంగా వినిపిస్తు న్నాయి.. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమ తులు లేకుండా దేవస్థానాన్ని పూర్తిగా కూల్చి వేయడం జరిగింది.. దీనికి సాకు ఏమి చెబుతున్నారు అంటే.. ఈ దేవస్థానం పురాతన మైపోయింది, కొత్త దేవాలయం కడుతున్నామని కలరింగ్ ఇస్తూ..
కాసుల కోసవిÖ ఈ పని చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. గత కొద్ది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగిల్ల శ్రీనివాస్ ఈ యొక్క దేవాలయం పేరుతో చేస్తున్న అక్రమ వ్యవహారాలపై పోరాటం చేసినట్లు తెలిసింది.. అతను ఈ దేవాలయాన్ని కాపాడుకోవడానికి అనేక విధాలుగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని వాదనలు సైతం వినిపిస్తున్నాయి.. మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీసు డిపార్ట్మెంట్ ఈ నాలుగు డిపార్ట్మెంట్లని అక్రమంగా ఏర్పరుచుకున్న మూడు ఇల్లీగల్ కమిటీలు మేనేజ్ చేసి, ఎటువంటి పర్మిషన్లు లేకుండానే నిర్మాణ పనులు చేస్తుండటంతో వారి ఆరోపణలకు బలం చేకూరినట్లు అయింది..

జీహెచఎంసి నుండి ఎలాంటి పర్మిషన్ లేకుండా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా ఈ దేవస్థానాన్ని ఈ ఇల్లీగల్ కమిటీలు మళ్లీ నిర్మిస్తున్నారు అంటే వీరు ఏ మేరకు అక్రమాలు చేస్తున్నారు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ అక్రమ నిర్మాణంలో సైతం అమ్మవారిని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి తీసుకెళ్లి ఫస్ట్ ఫ్లోర్ కి షిఫ్ట్ చేస్తున్నారు.. ఇది అత్యంత పాశవికమైన చర్య అని, ఇది భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉందని విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.. ఇలా శాస్తాలకు విరుద్ధంగా.. వేదాలు, ఇతరత్రా డిపార్ట్మెంట్స్ రూల్స్ కి విరుద్ధంగా ఈ చర్యలు చేయడం జరుగుతుంది..
నాగిళ్ల శ్రీనివాస్ గత కొద్ది సంవత్సరాలుగా అధికారులకు ఎన్ని విధాల కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోక పోవడం అధికారుల అవినీతి ఏ మేరకు చేరిందో అట్టే అర్థం చేసుకోవచ్చు..ఈ ఇల్లీగల్ కమిటీలు ఒక కమిటీ మరొక కమిటీ పైన, ఇంకో కమిటీ క్రిమినల్ కేసులు కూడా వేసుకోవడం వీరి అక్రమాలకు ఆజ్యం పోసుకున్నట్లు తేటతెల్లం అవుతుంది.. లెక్కల్లో పొరపాటు వచ్చాయని చెప్పి వాళ్ళపై క్రిమినల్ కేసులు సైతం నడుస్తున్నాయని తెలిసింది. ఇలా ప్రభుత్వ అనుమతి లేకుండా గుడి నిర్మాణం పేరుతో భక్తులను బురిడి కొట్టించి, ఇల్లీగల్ కమిటీలు పబ్లిక్ నుంచి 16 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు విశ్వసనీయ సమాచారం..ఈ పూర్తి వ్యవహారం వెనకాల ఒక బీఆరఎస్ కు చెందిన మాజీ మంత్రి ఉన్నట్టు, ఆయన కుమారుడు గుడి అక్రమ నిర్మాణ పనులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ అక్రమ కమిటీలకు వెనుక ఉండి మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తుంది..తెలంగాణ రాష్ట్ర దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగిళ్ల శ్రీనివాస్ ఈ అక్రమ వ్యవహారాలపై గత కొన్ని నెలల క్రితం హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ యొక్క దేవాలయాన్ని స్వాధీనం చేసుకోవాలని, ఏవైతే ఇల్లీగల్ గా అసోసియేషన్ వసూలు చేసిన డబ్బులు.. మరి ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకోవాల్సిందిగా, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ ని నియమించవలసిందిగా డిపార్ట్మెంట్ ను కోరినట్లు ఆయన తెలిపారు.. ఎండోమెంట్స్, రెవెన్యూ, పోలీస్, మున్సిపాలిటీ అధికారులు వాయిదాల విÖద వాయిదాలు వేస్తూ డేట్లు తీసుకోవడంలో మతలబేంటి అని ప్రశ్నిస్తున్నారు ఈ ప్రాంత ప్రజలు.. కౌంటర్ ఫైల్ చేయలేకపోవడంతో అధికారులు వ్యవహార తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి..
ఈ దేవాలయం పేరుతో ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో.. వారు సరైన కాగితాలు చూపించమని అడిగితే వాళ్ళకు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారని ఆయన ఆరోపించారు.. దీనిపై అనుమానం వచ్చిన కొందరు డబ్బులు కట్టినవారు తమ డబ్బులు తమకు వాపస్ ఇవ్వమనే డిమాండ్ సైతం చేసినట్లు తెలిసింది…అక్కడ జరుగుతున్న నిర్మాణం.. అక్రమమని తెలుసుకొని, ఆ కమిటీలు కూడా ఇల్లీగల్ కమిటీలు అని, మెంబర్లు కాకమ్మ కథలు చెబుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు..అయితే ఎలాంటి అనుమతులు లేకుండా.. ఒక కమిటీకి తెలియకుండా మరొక కమిటీ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది..
ఇక ఈ అక్రమ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పద్మావతి కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ సోమ ఆనంద్ కుమార్, చందా బాలేందర్ గ్రూప్స్, గౌరీ శంకర్ గ్రూప్ ఈ మూడు గ్రూపులు కలిసి అక్రమంగా వసూళ్లు చేస్తున్నట్టు తెలుస్తుంది.. ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్లు కూడా ఆందోళన చెందుతున్నారు..అయితే ఈ కమిటీల్లో తమకు తెలిసినవాళ్ళు, తమ బంధువులు, తమకు బాగా కావలసిన వారు ఉన్నారు కాబట్టి నమ్మకంతోతాము డబ్బులు ఇస్తున్నామని తెలిపారు.. ఎట్టి పరిస్థితుల్లో ఈ దేవాలయాన్ని ఫిబ్రవరిలో ప్రారంభిస్తామని చెబుతూ ఆ కమిటీల వారు బిల్డప్ ఇస్తుండటం గమనార్హం..అసలు ఇల్లీగల్ గా కట్టిన దేవాలయాలు కానీయండి, పర్మిషన్ లేకుండా కట్టిన దేవాలయాలు కానీయండి, కోర్టు ఉపేక్షిస్తుందా..?
ఎన్ని ఆర్డర్లు తీసుకున్నా కూడా ఎన్ని జడ్జిమెంట్లు తీసుకున్నా ఇల్లీగల్ ఇల్లీగలే.. కాగా కోర్టు ఎప్పటికైనా అది కాదు అని చెప్పి నాగిళ్ల శ్రీనివాస్ హైకోర్టులో వేసిన కేసు ఫలితం జరిగింది. ఏదైతే లెక్కలు తప్పుడుగా చూపిస్తున్నారో..? వాళ్లు చూపిస్తున్న అన్ని అకౌంట్స్ కు సబ్మిషన్ లేదు.. ఈ దేవాలయానికి, అలాగే సాయిబాబా టెంపుల్స్ కి సుప్రీం కోర్టు సెక్షన్ 15, 25 ఎండోమెంట్ యాక్ట్ అనగా ఈవో, ట్రస్ట్ బోర్డ్ మినహాయింపు అన్నమాట..
కానీ ఎండోమెంట్స్ కు సంబంధించిన అన్ని సెక్షన్లు ఈ టెంపుల్ కు కూడా వర్తిస్తాయి.. అలాంటప్పుడు ఈ దేవాలయానికి సంబంధించిన ఇన్కమ్ అండ్ ఎక్స్ పెండేచర్ ఇప్పటివరకు ఏ విధంగానైనా ఎండోమెంట్ కి వెళ్లి చూపిం చలేదు .. లెక్కలు కూడా చూపించలేరు.. అని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది.. ఈ మూడు కమిటీలు కలిసి ఈ నాలుగు డిపార్టుమెంట్లను మూడు కోట్లకు మేనేజ్ చేసినట్టు పబ్లిక్ లో ప్రచారం జరుగుతుంది..
అందుకే వీళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు.. అదే కాకుండా మున్సి పాలిటీ శాంక్షన్ ప్లాన్ ఇవ్వలేదు.. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు.. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ ఓ సీ కూడా లేదు.. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వయిరీ ఎందు కు చేయడం లేదు..? ఇంత పెద్ద స్కాం జరుగుతూ ఉన్నా.. పోలీసు డిపార్ట్మెంట్ వారిని ఎంక్వైరీ చేయమంటే వాళ్ళు నిమ్మకు నీరు ఎత్తినట్లు, తమకు ఏవిÖ పట్టనట్టు కూర్చున్నారు.. త్వరలో అంటే వచ్చే నెలలో హైకోర్టు ఈ కేసుపై విచారణ చేయబోతోంది.. మరి హైకోర్టు ఏం డైరెక్షన్ ఇస్తుందో వేచి చూడాలి..
