రష్యా(Russia)కు విమాన భాగాలను అక్రమం(Illegal)గా ఎగుమతి(Export) చేసినందుకు అమెరికాలో భారతీయుడి(Indian)కి జైలు శిక్ష పడింది. వాస్తవానికి ఆ వస్తువులను.. కౌశిక్, అతని భారతీయ కంపెనీకి సరఫరా చేస్తామని చెప్పి కొనుగోలు చేశారు. కానీ.. వాటిని రష్యన్ వినియోగదారుల కోసం కొనుగోలు చేసినట్లు తేలటంతో శిక్ష విధించారు. అమెరికాలోని ఒరెగాన్ నుంచి ఇండియా ద్వారా రష్యాకు నియంత్రిత విమానయాన భాగాలను అక్రమంగా ఎగుమతి చేసినట్లు రుజువుకావటంతో సంజయ్ కౌశిక్ అనే 58 ఏళ్ల భారతీయుడికి రెండున్నరేళ్ల జైలు శిక్ష వేశారు. అమెరికా భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అమెరికా న్యాయ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
- Advertisement -
