Wednesday, March 25, 2026
Homeరంగారెడ్డిRevanth Reddy | సీఎం రేవంత్‌వి చేతగాని మాటలు

Revanth Reddy | సీఎం రేవంత్‌వి చేతగాని మాటలు

నీటి పంపకాలపై పోరాటంలో మరోసారి తేలిపోయిందన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు

కృష్ణా, గోదావరి(Krishna and Godavari) నదీ జలాల్లో(River Waters) తెలంగాణ రాష్ట్ర హక్కుల(Telangana State Rights)ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Government) కాపాడలేదన్న సంగతి మరోసారి స్పష్టమైందని తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు కవిత(President Kavitha) విమర్శించారు. నీటి పంపకాల విషయంలో పొరుగు రాష్ట్రాలతో పేచీలు పెట్టుకోవడం ఇష్టం లేదన్న సీఎం రేవంత్ చేతగాని మాటలు న్యాయ పోరాటంలోనూ ప్రతిఫలించడం తెలంగాణ రాష్ట్ర దురదృష్టమని అన్నారు. ఏపీ ప్రభుత్వం కేంద్ర సర్కారు అండతో అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై విచారణ అర్హతలేని పిటిషన్ వేసి తెలంగాణ రాష్ట్ర హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాసిందని మండిపడ్డారు. నీటి సోయి లేని సీఎం, ప్రభుత్వంలోని ఇతర ముఖ్యుల వల్ల తెలంగాణ నీటి హక్కులకు పెను నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పారు. ఏపీ ప్రభుత్వ అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి న్యాయ పోరాటం చేస్తుందని తెలిపారు. తెలంగాణ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఉద్యమిస్తామని ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News