- మెగా రక్తదాన శిబిరం.
- రక్తానికి ప్రత్యామ్నయం ప్రపంచంలో ఎక్కడ కనుగొనబడలేదు.
- రక్తదానం ద్వారా మాత్రమే మరొకరి ప్రాణాలు కాపాడగలము.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం, గూడూరు గ్రామంలో స్వామి వివేకానంద 163వ జయంతి (జాతీయ యువజన దినోత్సవం) సందర్భంగా పాత హై స్కూల్ ఆవరణలో గ్రామ ఉద్యోగులు, గ్రామ యువత ఆధ్వర్యంలో, జీవన్ బ్లడ్ బ్యాంక్ హనుమకొండ వారి సహకారంతో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన యువత ఎంతో ఉత్సాహంగా, సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి రక్తదానం చేసి విజయవంతం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బండి వనజ కళాధర్ మాట్లాడుతూ, రక్తదానం చేసి మరొకరి ప్రాణం కాపాడటం అనేది గొప్ప కార్యం అని, రక్తానికి ప్రత్యామ్నయం ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా కనుగొనబడలేదని, రక్తదానం ద్వారా మాత్రమే రక్తాన్ని సేకరించి, అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడగలమని అన్నారు.
గ్రామానికి చెందిన 35 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారని, వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జక్కు రజనీకాంత్ మాట్లాడుతూ, స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని ఈ రక్తదాన శిబిరం నిర్వహించామని, అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా రక్తం అవసరమైనప్పుడు అందించడానికి ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం అని రక్తదానం చేయడం ద్వారా ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చని అన్నాడు.
రక్తం కృత్రిమంగా తయారు చేయలేమని, దాతల ద్వారానే ఇది సాధ్యమవుతుందన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతిఒక్కరూ మూడు నెలలకోసారి రక్తదానం చేయాలని కోరారు. గ్రామంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరానికి యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. బ్లడ్ డోనర్ బ్లడ్ మోటివేటర్, వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు (స్విమ్మర్ రాజు) మాట్లాడుతూ 50 కేజీల బరువు, ఆరోగ్యంగా ఉన్న 18 – 60 సంవత్సరాలు ఉన్న స్త్రీ, పురుషుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండి వనజ కళాధర్, జక్కు రజనీకాంత్, బ్లడ్ డోనర్ బ్లడ్ మోటివేటర్, వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు (స్విమ్మర్ రాజు), గుడికందుల సురేష్, కొమ్ము నాగరాజు, గన్నెబోయిన సందీప్, బండి అఖిల్, ర్యాకం సుధాకర్, నద్దునూరి కుమార్, బండి సురేష్, జక్కు దిలీప్, అచ్చే అరుణ్, బూడిద రాణేష్, అంకతి రాజ్ కుమార్, గాజుల నరేష్, మాడిశెట్టి శివకృష్ణం రాజు, జక్కు రాజేష్, గాజుల రమేష్, గుడికందుల మధు, అవునూరి రంజిత్ కుమార్, పత్తిపాక బలరాం, కుమ్మరి ప్రసాద్, చేరాల సదానందం, బండి నాగరాజు, రవి, వంశీనందు, బత్తిని రాజ్ కుమార్, ఉప్పు శివ రాజ్, చేరాల రవి, సదానందం, కుమ్మరి రాజు, నన్నెబోయిన శ్రీశైలం, గాజుల రామకృష్ణ, పిల్లల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
