Thursday, February 12, 2026
HomeతెలంగాణPonnam Prabhakar | ఇక ఈవీ పాలసీ అమలు..

Ponnam Prabhakar | ఇక ఈవీ పాలసీ అమలు..

  • కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటున్నాం
  • ప్రత్యేక ప్రోత్సాకాలతో ఎలక్ట్రిక్ వాహనాలు
  • ఈవీ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను పెంచుతున్నాం
  • అసెంబ్లీ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి

ఈవీ వాహనాల బ్యాటరీల సామర్థ్యం పెంపునకు కంపెనీలు చర్యలు చేపట్టాయని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఈవీ పాలసీ కింద తయారీదారులు, డీలర్లతో భేటీ ఏర్పాటు చేశామని అన్నారు. ఈవీ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్ల సంఖ్య పెంపునకు చర్యలు ఉంటాయన్నారు. మంగళవారం ఆయన శాసనసభలో ప్రసంగించారు.. ఈవీ వాహనాల రాయితీ అమలుతో రూ.900 కోట్ల పన్ను నష్టం అని.. ఉద్యోగులు ఈవి వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం తగ్గింపు ఉంటుందని పొన్నం తెలియజేశారు. ఉద్యోగులకు 20 శాతం వరకు తగ్గించాలని కంపెనీలను కోరామని అన్నారు. ఎంఎన్‌ సి కంపెనీలు ఈవి వాహనాలు కొనుగోలు చేసేలా విధానం ఉంటుందని, పిఎం ఈ డ్రైవ్‌ కింద 575 ఆర్టిసి బస్సులు నడుస్తున్నాయని చెప్పారు.

కొత్తగా 200కు పైగా ఈవి బస్సులు వస్తున్నాయని, వరంగల్‌ లో 100, నిజామాబాద్‌ లో 50 బస్సులు వస్తున్నాయని పేర్కొన్నారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను స్క్రాప్‌ చేయాలని, స్క్రాప్‌ పాలసీ కింద ప్రోత్సాహం ఇచ్చేలా జివో తీసుకువచ్చామని పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి ఈ కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఈవీ పాలసీని తీసుకువచ్చామని, ఈ ఏడాది కాలంలో లక్ష ఈవీ వాహనాలు అమ్ముడయ్యాయని వెల్లడిరచారు.. కాలుష్యం తగ్గాలంటే ఎలక్ట్రిక్‌్‌ వాహనాల వినియోగం పెరగాలని భాజపా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాలపై కేంద్రం సబ్సిడీ ఇస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అలా ఇస్తోందా?

- Advertisement -

అని ప్రశ్నించారు. ఛార్జింగ్‌ స్టేషన్లు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఈవీలను తక్కువగా వినియోగిస్తున్నారు. రాష్ట్రం మొత్తంపై ఆ తరహా వాహనాలు 70 వేలే నడుస్తున్నాయి. కాలుష్యం తగ్గాలంటే ఈ సంఖ్య పెరగాలి. రోడ్‌ ట్యాక్స్‌, వెహికిల్‌ ట్యాక్స్‌ మినహాయిస్తూ ప్రభుత్వం ప్రోత్సహించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఎలక్టిక్ర్‌ వాహనాలు వాడాలి. ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయాలని ఆయన అన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల మీద కేంద్రం సబ్సిడీ ఇస్తుంది.. తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్‌్‌ వాహనాల మీద సబ్సిడీ ఇస్తుందా? అని ప్రశ్నించారు..

త్రీ వీలర్‌, ఫోర్‌ వీలర్‌ ఎలక్టిక్ర్‌ వాహనాలపై ప్రమోట్‌ చేయాలని సిర్పూర్‌ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌ బాబు తెలిపారు. ‘హైదరాబాద్‌ను పొల్యూషన్‌ ఫ్రీ చేయాలంటే.. ఎలక్ట్రిక్‌ వాహనాలను వాడాలి.. ఎలక్ట్రిక్‌, సోలార్‌ ప్యానెల్‌ తో నడిచే వాహనాలను ప్రోత్సహించాలి.. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరగాలంటే పెద్ద ఎత్తున సబ్సిడీలు కల్పించాలి.. పార్కింగ్‌ స్థలాల్లో ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలి.. ఇవీ పాలసీని తీసుకుని వస్తున్నందుకు ధన్యవాదాలు‘ అని ఎమ్మెల్యే అన్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News