Friday, February 27, 2026
Homeమెదక్‌Jaggampet | నూతన పాఠశాలకు నిధులు మంజూరు చేయాలి.

Jaggampet | నూతన పాఠశాలకు నిధులు మంజూరు చేయాలి.

  • సికింద్లాపురం పోచయ్య

మండలంలోని జగ్గంపేట ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో ఉందని గతంలో కలెక్టర్కు,తహసీల్దార్కు,ఎంపీ డీవోకు ఎన్నో సార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని జగ్గంపేట మాజీ సర్పంచ్ పోచయ్య ఎంపీడీవో ప్రవీణ్ నాయక్ దగ్గర ఆవేదన వ్య క్తం చేశారు.చిలిపిచేడ్ లో ప్రజావాణి కార్యక్ర మం ఏర్పాటు చేశారు.మండల అధికారులు తహసీల్దార్,ఎంపీడీవో,ఎస్సై, ఎంఈవో,వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు ఆ శాఖ అధికారులకు సమస్యలు తెలియజేశారు.జగ్గంపేట ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో ఉండి గోడలు కూలిపోయ్యాయని మాజీ సర్పంచ్ పోచయ్య మండల ప్రజావాణిలో ఎంపీడీవోకు,తహసీల్దార్కు తెలిపారు. తహసీల్దార్ సహదేవ్,ఎంపీడీవో ప్రవీణానాయక్,ఏఈవో అనిత,సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News