Saturday, February 28, 2026
Homeరంగారెడ్డిCPI Leader | అంతర్జాతీయ చట్టాలని గౌరవించని అమెరికా

CPI Leader | అంతర్జాతీయ చట్టాలని గౌరవించని అమెరికా

  • సిపిఐ అబ్దుల్లాపూర్ మండల కార్యదర్శి అజ్మీరా హరిసింగ్ నాయక్

ప్రపంచం అంత తన గుప్పిట్లో ఉండాలనే ఒక అహంకారపూరితమైన,ఆధిపత్య దొరనితో వెనెజులా దేశ అధ్యక్షుడు నీకోలస్ మధురోని అమెరికా సైన్యం కిడ్నాప్ చేయటాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) అబ్దుల్లాపూర్ మెట్ మండల ప్రధాన కార్యదర్శి అజ్మీరా హరిసింగ్ నాయక్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్బంగా హరిసింగ్ నాయక్ మాట్లాడుతూ ఇంగ్లాండ్ ఆధిపత్య పాలన నుండి స్వాతంత్రం పొందిన అమెరికా ఆ విషయాన్నీ మర్చిపోయి అప్పటి నుండి అనేక చిన్న దేశాలపైన దాడులు చేస్తూ చాలా దేశాలని నాశనం చేసింది.ప్రపంచాన్ని శాషించలిచాలనే అహంకారంతో పలు దేశాల ను దురాక్రమణకు పాలుపడుతుంది.

అందులో భాగంగానే శనివారం ఉదయం వెనెజులా దేశ అధ్యక్షుడు నీకోలస్ మధురో మరియు అతని భార్యని వారి ఇంటిపైన అమెరికా బలగాలు దాడి చేసి ఇంట్లోకి చొరబడి కిడ్నాప్ చేసి న్యూయార్క్ కి తరలించటం ఏ ప్రజాస్వామిక సూత్రాల్లో లేదని మండిపడ్డారు.వెనెజులా మత్తు పదార్ధాలని అక్రమంగా అమెరికా లోకి రవాణా చేస్తుందని కుంటి సాకు చెపుతున్నప్పటికి.ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అన్ని దేశాలపై ఉందనే విషయాన్నీ అమెరికా మర్చిపోయి ఇలా అనేక సార్లు దేశాల దురాక్రమణ చేస్తూ అంతర్జాతీయ చట్టాలని ఉల్లంగిస్తుందని అన్నారు.వెంటనే ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని వెనిజుల అధ్యక్షుడిని విడుదల చేయించాలని మరియు వెనిజులలో శాంతి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని అలాగే అమెరికా అప్రజాస్వామిక చర్యలని ప్రపంచ దేశాలు అన్ని ఖండించాలని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News