- మేడ్చల్ డిప్యూటీ కమిషనర్ కి వినతి పత్రం సమర్పించిన
- స్థానిక నాయకులు
అత్వెల్లిలో ఉన్న డంపింగ్ యార్డులను తొలగించాలి అని కోరుతూ సోమవారం మేడ్చల్ డిప్యూటీ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించిన స్థానిక నాయకులు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడ్చల్ అత్వెల్లి ప్రాంతములో ఉన్న తూర్పు – పడమర ఇరువైపుల డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి మేడ్చల్ పలు ప్రాంతాల్లో నుండి చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారుఅని అన్నారు.
ఇప్పుడు అది పెద్ద మొత్తంలో డంపింగ్ యార్డుగా ఏర్పడింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు,డంపింగ్ యార్డులో చెత్తను తగల పెట్టడము వల్ల చుట్టూ ప్రక్కల ఉన్న ప్రాంతాలలో విష కాలుష్యంతో కూడిన పొగ వ్యాపించి ప్రజలకు శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది, శ్వాస సంబంధిత వ్యాధులుతో తీవ్ర ఇబ్బందులు కల్గుతున్నాయి అని అన్నారు,దయచేసి ఈ సమస్యకు పరిష్కారం కోసం డంపింగ్ యార్డులను వెంటనే తొలగించాలి అని అధికారులను వేసుకున్న స్థానిక నాయకులు, ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు మండల ఈశ్వరయ్య ,మండల రవికుమార్,గడ్డం రాజుకుమార్, గడ్డం ప్రదీప్ కుమార్, వడ్ల వెంకటేష్ చారి, గడ్డం రాజు,ఎర్రోళ్ల దయానద్ తదితరులు పాల్గొన్నారు.
