Homeరంగారెడ్డిSewage Problem | జవహర్ నగర్ లో మురికి కంపుతో కాలనీవాసుల అవస్థలు

Sewage Problem | జవహర్ నగర్ లో మురికి కంపుతో కాలనీవాసుల అవస్థలు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్,జి హెచ్ ఎం సి పరిధిలోని గబ్బిలాల పేట కే సి ఆర్ నగర్ వై ఎస్ ఆర్ నగర్ ప్రాంతాల్లో నెలల తరబడి మురికి నీరు నిలిచిపోయి తీవ్ర దుర్గంధంతో కాలనీవాసులు ముక్కు మూసుకొని జీవించాల్సిన పరిస్థితి నెలకొంది. మోరి పూర్తిగా బ్లాక్ కావడంతో మురుగు నీరు రోడ్లపైకి పొంగి పొర్లి ఇళ్ల ముందే నిల్వ ఉండటంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Residents of Gabbilala Peta KCR Nagar and YSR Nagar suffer due to stagnant and foul smelling sewage water in Jawahar Nagar

దోమల బెడద పెరిగి జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉన్నా మున్సిపల్ జి హెచ్ ఎం సి అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు వృద్ధులు తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురవుతున్నా అధికారులు స్పందించకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

- Advertisement -
Residents of Gabbilala Peta KCR Nagar and YSR Nagar suffer due to stagnant and foul smelling sewage water in Jawahar Nagar. 11

తక్షణమే మోరిని శుభ్రం చేసి మురుగు నీటి ప్రవాహాన్ని సరిచేయాలని జి హెచ్ ఎం సి గ్రేటర్ అధికారులు పరిశీలన చేసి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని గబ్బిలాల పేట కే సి ఆర్ నగర్ వై ఎస్ ఆర్ నగర్ కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News