బాన్సువాడ నియోజకవర్గం బోర్లం గ్రామ శివారులోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల ఆవరణలో జరిగిన శ్రీరామ నామస్మరణ(Sri Rama Namasmarana) గురు వందనం(Guruvandanam) కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే(Banswada MLA) పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) పాల్గొన్నారు. శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకను బోర్లం వాస్తవ్యులు పర్వారెడ్డి ఏర్పాటుచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు కూడా అయిన పోచారంతోపాటు రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్(Chairman of the State Agros) కాసుల బాలరాజు, పోచారం శంభు రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -
