నాగారం సత్యనారాయణ కాలనీ పరిధిలో గల సోను చికెన్ అండ్ మటన్ షాప్‌పై కీసర పోలీసులు శనివారం రాత్రి దాడి చేసి మేకల నుండి రక్తాన్ని సేకరిస్తున్న వ్యక్తులను అరెస్టు చేశారు. షాప్ యజమాని సుందర్ సోను, అతని ఉద్యోగి అఖిల్ అనే ఇద్దరు వ్యక్తులు గొర్రెలు మరియు మేకల నుండి రక్తాన్ని సేకరిస్తూ, ఆ రక్తాన్ని అందజా 130 బ్యాగ్ లలో నిల్వ ఉంచినట్లు గుర్తించబడింది.
సేకరించిన రక్తాన్ని కాచిగూడలో సిఎన్‌కె ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థకు విక్రయించి, ల్యాబొరేటరీలలో ఉపయోగించే షీప్ బ్లడ్ ఆగర్ ప్లేట్స్ తయారీకి వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యకలాపాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం జీహెచ్ఎంసీ అధికారులకు మరియు వెటర్నరీ డిపార్ట్మెంట్ కి అప్పగించనున్నట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు.
