Sunday, February 22, 2026
Homeఅంతర్జాతీయంSaudi Arabia | సౌదీలో అత్యధిక ఉరిశిక్షలు

Saudi Arabia | సౌదీలో అత్యధిక ఉరిశిక్షలు

సౌదీ అరేబియా 2025లో అత్యధిక ఉరిశిక్ష(Death Penalty)లను అమలుచేశారు. ఒక్క సంవత్సరంలోనే రికార్డ్ స్థాయిలో ఏకంగా 356 మందికి మరణ శిక్ష విధించారు. దీంతో.. ఈ గల్ఫ్ రాజ్యం(Gulf Kingdom) తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. మానవ హక్కుల సంఘాలు(Human Rights Groups) దీన్ని ఖండించాయి. ఇటీవలి కాలంలో రియాద్‌(Riyadh)లో ప్రారంభించిన “మాదకద్రవ్యాల(Narcotics)పై యుద్ధం” కారణంగా మరణశిక్షలు పెరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తొలిసారి అరెస్టయినవారిలో చాలా మందికి చట్టపరమైన చర్యలు, నేరారోపణల తర్వాత ఉరిశిక్ష అమలుచేశారు.

ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం.. 2025లో మాదకద్రవ్యాల కేసుల్లో 243 మందికి ఉరిశిక్ష విధించినట్లు ఏఎఫ్‌పీ డేటా తెలిపింది. సౌదీలో 2024లో మొత్తం 338 మందికి మరణశిక్ష అమలుచేశారు. ఆ తర్వాత 2025లో అత్యధిక ఉరిశిక్షల అమలుతో సౌదీ అరేబియా వరుసగా రెండో సంవత్సరం ఎక్కువ మరణశిక్షల అమలుతో కొత్త రికార్డును నెలకొల్పింది. మాదకద్రవ్యాల కేసుల్లో మరణశిక్షల అమలును నిలిపివేసిన దాదాపు మూడేళ్ల తర్వాత తిరిగి 2022 చివరిలో అమలుచేసింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News