Wednesday, February 11, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐCitizenships | రెండు పౌరసత్వాలు ఇవ్వండి

Citizenships | రెండు పౌరసత్వాలు ఇవ్వండి

అమెరికాలో ఉంటున్న భారతీయులకు ఇండియాతోపాటు అమెరికా పౌరసత్వం(రెండూ) కూడా ఇవ్వాలని ప్రవాసీ లీగల్ సెల్(Pravasi Legal Cell) కోరింది. ఈ మేరకు హ్యూస్టన్‌(Houston)లోని భారతీయ రాయబార కార్యాలయం(Consulate General of India)లో వినతిపత్రం అందజేశారు. ద్వంద్వ పౌరసత్వం వల్ల ఇండియాకి మేలు కలుగుతుందని చెప్పారు. విదేశాల్లో జీవిస్తున్న భారతీయులకు సొంత దేశంతో సంబంధాలు మరింత బలోపేతం కావటానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. దీనిపై స్పందించిన కార్యాలయ ప్రతినిధి.. రెండు పౌరసత్వాలు(Dual Citizenship) ఇవ్వటానికి గల చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఫారన్‌లో ఉంటున్న మన దేశస్తులకు ఇండియా ప్రస్తుతం ఓసీఐ కార్డును జారీ చేస్తోంది. ఈ కార్డు ఉంటే లైఫ్ లాంగ్ ఇండియాకి రావొచ్చు. ఇక్కడ ఆస్తులు కొనుక్కోవచ్చు. కానీ.. ఓటేయటానికి వీలుండదు. రాజకీయపరమైన పదవులు చేపట్టకూడదు. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత ఉండదు. మన దేశం మొదటి నుంచీ ఏక పౌరసత్వమే కల్పిస్తోంది. అమెరికా, కెనడా, బ్రిటన్ లాంటి కొన్ని దేశాలు మాత్రం రెండు పౌరసత్వాలను జారీచేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News