Friday, March 6, 2026
Homeమహబూబ్‌నగర్‌Wishes | నూతన సంవత్సరం అందరి జీవితంలో వెలుగులు నింపాలి

Wishes | నూతన సంవత్సరం అందరి జీవితంలో వెలుగులు నింపాలి

  • సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్..

2026 నూతన సంవత్సరంలో ప్రజలందరి జీవితంలో వెలుగులు నింపాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్‌ గౌడ్‌ ఆకాంక్షించారు. కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచి, చెడులను కష్ట, సుఖాలను సమానంగా స్వీకరించే స్థిత ప్రజ్ఞతను అలవర్చుకుంటూ ఆశావహ దృక్పథంతో తమ జీవితాలను చక్కదిద్దుకోవాలని కోరారు. ఆశతో జీవించడమే జీవిత పరమాత్మమని ప్రజలందరు మంచి జరుగుతుందని ఆశతో జీవించాలని అన్నారు. నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని ..

నూతనంగా ఎన్నిక అయిన సర్పంచులు గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం ఉన్నత లక్ష్యం తో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ వారి రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. నాయకులకు, మేధావులకు, కవులు, కళాకారులు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News