Friday, February 13, 2026
Homeవరంగల్‌MGNREGS | పలువురు సిబ్బందికి పెనాల్టీ విధింపు…

MGNREGS | పలువురు సిబ్బందికి పెనాల్టీ విధింపు…

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.జి. ఎన్.ఆర్.ఈ.జి.ఎస్) కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో (1-4-2024 నుండి 31-3-2025 వరకు) అన్ని గ్రామాల్లో చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ బృందం గుర్తించిన అంశాలపై మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా వేదికకు డిఆర్డిఓ శ్రీ రామ్ రెడ్డి హాజరు కావడం జరిగింది. 2024-25 లో ఉపాధి హామీ పథకం కింద రూ. 5,61,53,277 లు, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 7,23,96,242 రూపాయలు, మన ఊరు మన బడి ద్వారా 19,36,020 రూపాయలు, ఫారెస్ట్ శాఖ ద్వారా 2,04,417 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.

33 గ్రామాల్లో సామాజిక తనిఖీ బృందం తనిఖీ చేసిన పనులలో ఫీల్డ్ అసిస్టెంట్ లకు 25482, టెక్నికల్ అసిస్టెంట్ లకు 9791, కంప్యూటర్ ఆపరేటర్లకు 250, ఈసీ కి 1175, పంచాయతీ కార్యదర్శులకు 18259, ఇతరులకు 46704 మొత్తం రూపాయలు పెనాల్టీ విధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీడీ శ్రీవాణి , జిల్లా విజిలెన్స్ అధికారి అలివేలు, ఎంపీడీఓ మాలోత్ శంకర్ నాయక్, ఎస్టీఎం అజయ్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రమేష్, గంగరాజు, ఏ.పి.ఓ సుశీల్ కుమార్, ఈసీ రాజు, టీ.ఏ లు, సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News