- ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తా
- ప్రాణం ఉన్నంతవరకు గ్రామస్తులకు తోడుంటా
- బిజీ వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ చెక్కల పరమేశ్వర్
గ్రామస్తుల కృషివల్లే తాను అధికారంలోకి వచ్చానని ఎన్నికల సమయంలో గ్రామస్తులకు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటానని ప్రాణం ఉన్నంత వరకు గ్రామస్తులకు తోడుగా ఉంటానని బీజీ వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ చెక్కల పరమేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గ్రామస్తులకు పలు హామీలను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గొల్లపల్లి నుండి బీజీ వెంకటాపూర్ గ్రామం వరకు బిటి రోడ్డు నిర్మాణం, పెద్దమ్మ దేవాలయం నుండి గ్రామ చివరి వరకు ఓపెన్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, గ్రామంలో పెండింగ్లో ఉన్న సిసి రోడ్డు నిర్మాణం, గ్రామ ప్రభుత్వ ఫంక్షన్ హాల్లో పెండింగ్ పనులు పూర్తి చేస్తానని, విధి దీపాలు పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపెడతానని మాట ఇవ్వడం విధితమే.
ఇచ్చిన మాట ప్రకారం మంగళవారం రోజున ఆయన గ్రామంలో సందర్శించడం జరిగింది. మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే ఈ సమస్యలపై అధికారులతో చర్చించి గ్రామస్థులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తానని వీధి వీధి గుండా తిరుగుతూ ప్రజలకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా ముఖ్యంగా గ్రామంలో చీకటిగా ఉన్న వీధుల్లో స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేస్తానని ప్రజలకు వీధుల్లో పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపెడతానని ప్రజలు రోగాల పాలు కాకుండా ఇళ్లలో దోమలు చేరకుండా వీధి, వీధి గుండా ఫాగింగ్ చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.
