Friday, March 6, 2026
Homeఆదిలాబాద్Asifabad Mla | జంగుబాయి ఉత్సవాల్లో పాల్గొన్న కోవ లక్ష్మి

Asifabad Mla | జంగుబాయి ఉత్సవాల్లో పాల్గొన్న కోవ లక్ష్మి

​కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కేరిమెరి మండలం కోట పరందోలి గ్రామంలో పవిత్ర పుణ్యక్షేత్రం జంగుబాయి(Jangubai) ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దొత్రే, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి(Kova Lakshmi), ఎంపీ గోడం నగేష్(MP Godam Nagesh), అదనపు కలెక్టర్ దీపక్ తివారి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ​ఆదివాసీల ఆరాధ్య దైవం(Tribals Deity) జంగుబాయి అమ్మవారిని దర్శించుకొని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే.. అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేతలు(BRS Pary Leaders) మర్సకోల సరస్వతి, పలువురు అధికారులు, వివిధ పార్టీల నాయకులు, ఆదివాసీ సంఘాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News