Tuesday, February 10, 2026
Homeక్రైమ్ వార్తలుDeer Meat | అక్రమంగా జింక మాంసం అమ్మకం

Deer Meat | అక్రమంగా జింక మాంసం అమ్మకం

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో అక్రమంగా జింక మాంసం అమ్ముతుండగా రాజేంద్రనగర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకొని అతని నుంచి రూ.3 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుణ్ని సులేమాన్ నగర్‌కు చెందిన మహ్మద్ ఇర్ఫానుద్దీన్‌గా గుర్తించారు. జింకను నల్లమల అడవి(Nallamala Forest)లో వేటాడి పట్టుకొని, చంపి, దాని మాంసాన్ని వనపర్తి జిల్లాలోని పెబ్బేరు నుంచి హైదరాబాద్ సిటీకి తీసుకొచ్చినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. జింక మాంసం కిలో రూ.800కు విక్రయిస్తున్నట్లు తెలిపాడు. పోలీసులు వన్యప్రాణుల (రక్షణ) చట్టం Wildlife(Protection) Act కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇతని వెనక ఉన్న అక్రమ వన్యప్రాణుల వాణిజ్య నెట్‌వర్క్‌(Illegal Wildlife Trade Network)ను ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. వన్య ప్రాణులను వేటాడేవారి(Poaching) పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News