Thursday, February 12, 2026
Homeవరంగల్‌Praja Vedika | రేపటి ప్రజా వేదికలో పాల్గొనాలి

Praja Vedika | రేపటి ప్రజా వేదికలో పాల్గొనాలి

  • ఎంపీడీవో శంకర్ నాయక్.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో (1-4-2024 నుండి 31-3-2025 వరకు) అన్ని గ్రామాల్లో చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ బృందం గుర్తించిన అంశాలపై ఈనెల 30న ఉదయం 10 గంటలకు మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా వేదిక ఏర్పాటు చేసినట్లు స్థానిక ఎంపీడీవో మాలోతు శంకర్ నాయక్ ప్రకటన ద్వారా తెలిపారు. కావున మండల పరిధిలోని సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం సిబ్బంది, గ్రామస్థులు, ఉపాధి హామీ వేతనదారులు తప్పక పాల్గొనాలని కోరడమైనది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News