Tuesday, March 3, 2026
HomeతెలంగాణTelangana Assembly | రేపటి నుంచి శీతాకాల సమావేశాలు

Telangana Assembly | రేపటి నుంచి శీతాకాల సమావేశాలు

ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు(Winter Session) ప్రారంభం కానున్నాయి. 30, 31 తేదీలతోపాటు జనవరి ఒకటో తేదీన సమావేశాలు జరగవు. మళ్లీ జనవరి 2వ తేదీ నుంచి కొనసాగనున్నాయి. రిజర్వేషన్లు (Reservations), స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections)పై కీలక చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఎంపీటీసీ(MPTC), జెడ్పీటీసీ(ZPTC) ఎన్నికల రిజర్వేషన్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

సమావేశాల అజెండా..

- Advertisement -

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రిజర్వేషన్లపై చర్చ. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ విధానంపై స్పష్టత తీసుకురావడమే లక్ష్యంగా చర్చలు జరగనున్నాయి. PACS ఎన్నికల నిర్వహణపై విధానపరమైన నిర్ణయం తీసుకునే సూచనలు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయడంపై అసెంబ్లీలో విస్తృత చర్చ జరగనుంది. 42% బీసీ రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వ అనుమతి/మద్దతు సాధించేందుకు రాజకీయ, పరిపాలనా స్థాయిలో ఒత్తిడి పెంచే వ్యూహాలపై ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే అసెంబ్లీ తీర్మానాలు, ఎంపీలతో సమన్వయం వంటి చర్యలు తీసుకునే అవకాశం. ఈ సమావేశాలు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశం ఉండటంతో ప్రభుత్వ నిర్ణయాలపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News