Thursday, January 22, 2026
EPAPER
Homeఎన్‌.ఆర్‌.ఐJayshree Ullal | అత్యంత సంపన్నురాలు

Jayshree Ullal | అత్యంత సంపన్నురాలు

అరిస్టా నెట్‌వర్క్స్ (Arista Networks) అధ్యక్షురాలు(President), సీఈఓ (CEO) జయశ్రీ ఉల్లాల్.. భారతీయ మూలాలు కలిగిన సీఈఓల్లో అత్యంత ధనవంతురాలిగా నిలిచారు. ఆమెను ప్రపంచంలోనే అత్యంత సంపన్న భారతీయ సంతతి నాయకురాలిగా హరున్ ఇండియా (Harun India) పేర్కొంది. తద్వారా జయశ్రీ.. సత్య నాదెళ్ల(Satya Nadella), సుందర్ పిచాయ్‌(Sundar Pichai) వంటి ప్రపంచ పెద్ద టెక్ చీఫ్‌లను అధిగమించారు. 17 ఏళ్లుగా అరిస్టా నెట్‌వర్క్స్‌కు నాయకత్వం వహిస్తున్న ఆమె రూ.50,170 కోట్ల నికర విలువతో వరల్డ్ వైడ్‌గా ధనిక భారతీయ సంతతి ప్రొఫెషనల్ మేనేజర్‌గా అవతరించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల రూ.9770 కోట్ల నికర విలువతో రెండో స్థానంలో ఉండగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ రూ.5,810 కోట్లతో ఏడో స్థానంలో ఉన్నారు. అరిస్టా నెట్‌వర్క్స్ అనేది కాలిఫోర్నియాకు చెందిన నెట్‌వర్కింగ్ కంపెనీ. ఇది పెద్ద డేటా సెంటర్లు, AI వాతావరణాలు, క్యాంపస్‌లకు డేటా ఆధారిత క్లౌడ్ నెట్‌వర్కింగ్‌లో ప్రత్యేకత కలిగి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News