Homeవరంగల్‌Fraud | అయ్యప్ప మాల పేరుతో వృద్ధులపై మోసం

Fraud | అయ్యప్ప మాల పేరుతో వృద్ధులపై మోసం

అయ్యప్ప మాల వేసి జనాలకు టోకరా వేసి.. తాయతలు కడుతూ వృద్ధుల బంగారం కాజేసే యత్నంలో అడ్డంగా దొరికిన ఖమ్మం వాసులు పోలీస్ స్టేషన్కు అప్పగించిన మార్కండేయ కాలనీవాసులు

నాగరికత రోజురోజుకు అభివృద్ధి జరుగుతున్న క్రమంలో ఇంకా ప్రజలు తాయత్తుల తథంగాలను నమ్ముతూనే ఉన్నారు. వృద్ధుల మూఢనమ్మకాలను ఆసరా చేసుకున్న మోసగాళ్లు అయ్యప్ప మాలవేషంలో వచ్చి నర్సంపేట పట్టణంలోని మార్కండేయ కాలనీలో వృద్ధులు ఉండే ఇళ్లను టార్గెట్ చేసుకొని వారి ఇంటికి వెళ్లి వారికి సోది చెప్పి ప్రయత్ని కడతాం పసరు మందులు ఇస్తాం మీ ఆరోగ్యం కుదుటపడుతుంది అనే మాయమాటలు చెప్పి వృద్ధులు స్పృహ కోల్పోయే విధంగా పథకాన్ని రచించుకొని వృద్ధుల వెంటపడ్డారు. దీంతో కాలనీవాసులు అప్రమత్తమై అయ్యప్ప మాల వేషధారణలో ఉన్న ఇరువురిని పట్టుకొని నానా రకాలుగా ప్రశ్నలు సంధించి చివరకు మోసగాళ్లు అని గుర్తించి స్థానిక నర్సంపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్లో అప్పగించిన సంఘటన జరిగింది.

- Advertisement -
Ayyappa Mala Fraudsters Caught in Narsampet 1

ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రచార కార్యదర్శి బాలినే జగన్ మాట్లాడుతూ, వృద్ధులు నివాసముండే ఇళ్లను టార్గెట్ చేసి వారికి మాయమాటలు చెబుతూ ఫసరు రసం తాగితే ఆరోగ్యం కుదుటపడుతుందని సిరిసంపదలు వస్తాయని నమ్మబలికి వృద్ధుల మెడలోని బంగారం దొంగిలించే ప్రయత్నంలో కాలనీవాసులు గుర్తించి నల్లటి బట్టలు వేసుకున్న వ్యక్తులు హనుమాన్ మాల వేశామని చెబుతూ పొంతన లేని మాటలు చెబుతుండడంతో మోసకారులు అని గుర్తించి నర్సంపేట పోలీస్ స్టేషన్ లో అప్పగించామని జగన్ వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News