- ఫర్టిలైజర్ షాపుల మీద నిఘా పెట్టండి
- జిల్లా సిపిఎం పార్టీ అనుబంధ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు డిమాండ్.
వ్యాప్తంగా సన్న, చిన్న కారు రైతులకు సరిపడే యూరియా నిలువలు ఉంచాలని, పొలం నాట్లు సమయం కాబట్టి అగ్రికల్చర్ అధికారులు రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాలనిసిపిఎం పార్టీ అనుబంధ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రామంచ అశోక్ డిమాండ్ చేసారు భూస్వాములకు అనుకూలంగా వారికే మొట్టమొదలు సరిపడా యూరియా దొడ్డిదారిన సరఫరా చేస్తూ, సన్న చిన్న కారు రైతులు, పేద రైతులకు దొరకకుండా వ్యవహరిస్తున్నారన్నారు.
జిల్లా అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు దృష్టి పెట్టి అందరికీ సమానంగా చూడాలని, అలాగే అందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని, బ్లాక్ మార్కెట్ వ్యవస్థను అరికట్టాలన్నారు. ముఖ్యంగా ఫర్టిలైజర్ షాపుల మీద ఎప్పటికప్పుడు అధికారులు నిగా పెట్టాలని, ఈ సందర్భంగా జిల్లా సిపిఎం పార్టీ అనుబంధ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రామంచ అశోక్ పత్రికా ముఖంగా,పేద రైతాంగం పక్షాన డిమాండ్ చేస్తున్నారు..
