ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి(Adilabad Rims Hospital)లో కొత్తగా నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్(Critical Care Center)ను శుక్రవారం ప్రారంభించారు. రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(KishanReddy), జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(Vedma Bojju Patel) ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేంద్రంతో సయోధ్యతో వ్యవహరిస్తూ.. వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఉపాధి రంగాల్లో ముందడుగు వేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీలు విఠల్, కొమురయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు పాల్గొన్నారు.
Khanapur Mla | రిమ్స్ క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభం
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
