Thursday, February 12, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐShankara Netralaya | సంగీత కచేరి విజయవంతం

Shankara Netralaya | సంగీత కచేరి విజయవంతం

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ప్లాసెంటియా నగరం(City of Placentia)లో సంగీత కచేరి విజయవంతంతగా జరిగింది. శంకర నేత్రాలయ లాస్ ఏంజెల్స్ చాప్టర్ ఆధ్వర్యంలో వాలెన్సియా హైస్కూల్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిధుల సేకరణ (Fundraise) కోసం ఏర్పాటుచేసిన ఈ లైట్ మ్యూజిక్ కన్సర్ట్‌(Light Music Concert)లో సింగర్స్ సుమంగళి, అంజనా సౌమ్య, పార్థు నేమాని, మల్లికార్జున్ తమ అద్భుతమైన పాటలతో ఆకట్టుకున్నారు.

మూడు గంటలకు పైగా జరిగిన సంగీత కచేరి.. శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. లాస్ ఏంజెల్స్‌లోని ఇండియన్ కాన్సుల్ జనరల్(Indian Consul General) డాక్టర్ కె.జె.శ్రీనివాస్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొంత దేశం, నివసిస్తున్న దేశం మధ్య సానుకూల సంబంధాలను పెంపొందించడంలో ఎన్ఆర్ఐలు (NRIs) కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News