Sunday, February 22, 2026
HomeజాతీయంMaoist Encounter | ఒడిశాలో ఎన్‌కౌంటర్‌

Maoist Encounter | ఒడిశాలో ఎన్‌కౌంటర్‌

  • మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పులు…
  • మృతుల్లో తెలంగాణను చెందిన మావోయిస్టుల కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు పాకా హనుమంతు అలియాస్‌ గణేశ్‌ హతం..
  • మొత్తం నలుగురు మృతి చెందినట్లు వెల్లడి

ఒడిశాలోని కందమాల్‌ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు పాకా హనుమంతు అలియాస్‌ గణేశ్‌ ఉన్నట్లు పోలీసులు వెల్లడిరచారు. ఆయనపై రూ.1.10 కోట్ల రివార్డు కూడా ఉందని తెలిపారు.హనుమంతు స్వస్థలం తెలంగాణలోని నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామం అని అధికారులు తెలిపారు. మరోవైపు ఘటనాస్థలిలో ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోంది. పాక చంద్రయ్య, పాపమ్మ దంపతుల ఆరుగురు సంతానంలో గణెళిష్‌ మొదటివారు. ఆయన 1961లో జన్మించారు. హనుమంతుకు ముగ్గురు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. చండూరులో పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ నల్గొండలో చేస్తూ రాడికల్‌ యూనియన్‌లో పనిచేశారు.

45 ఏళ్ల క్రితం ఏచూరి శ్రీనివాస్‌ హత్యలో ఆయన కీలకపాత్ర పోషించారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లి నక్సలైట్‌ ఉద్యమంలో చేరారు. అప్పటినుంచి ఆయన ఇంటివైపు చూడలేదు. ఆయన అమ్మ, నాన్న చనిపోయినప్పుడు కూడా రాలేదు. మండల కమిటీ నుంచి జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి నేతగా ఎదిగి మూడు రాష్టాల్రకు కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఇటీవలి కాలంగా ఆరోగ్యం బాగాలేక ఇబ్బంది పడుతున్నారని సమాచారం. ªూక హనుమంతు చిన్నప్పటినుంచే కమ్యూనిస్టు భావజాలం కలిగి ఉన్నారని ఆయన సోదరుడు తెలిపారు. హనుమంతు తండ్రి సీపీఎం పార్టీలో పనిచేశారు. దీంతో చదువుకునే రోజుల్లోనే ఉద్యమం వైపు వెళ్లారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News