ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులందరినీ సిట్ అధికారులు(Sit Officers) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ప్రణీత్‌రావు, భుజంగరావు, రాధాకిషన్‌రావు, తిరుపతన్నలను పిలిచిన సిట్.. వారిని విచారిస్తున్నారు. నేటితో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ (Sib Former Chief) ప్రభాకర్ రావు(Prabhakar Rao) విచారణ ముగియనుండటంతో అందరితో కలిపి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే సిట్ అధికారి రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా.. సిట్ ఆఫీసుకు చేరుకున్నారు. నేటితో ప్రభాకర్ రావు 14 రోజుల విచారణ ముగియనుండగా.. రేపు(శుక్రవారం) ఉదయం 10 గంటలకు పోలీస్ కస్టడీ నుంచి విడుదల కానున్నారు.
అయితే.. 14 రోజుల కస్టడీలో ప్రభాకర్‌రావు ఏం చెప్పారనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి అనేక ప్రశ్నలకు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ సమాధానం చెప్పనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి పెన్ డ్రైవ్(Pen Drive)ను సిట్ అధికారులు కీలక ఆధారంగా భావించారు. ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్‌గా పనిచేసిన కాలంలో పెన్ డ్రైవ్‌లో ట్యాపింగ్ వివరాలు స్టోర్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ పెన్ డ్రైవ్ డేటాను ప్రభాకర్ రావు ముందు పెట్టి విచారించారు. అయితే.. అందులో 6 వేల ఫోన్ నంబర్లు ఉన్నప్పటికీ పెన్ డ్రైవ్‌పై ప్రభాకర్ రావు ఎలాంటి జవాబు ఇవ్వనట్లు సమాచారం.
