Wednesday, March 25, 2026
HomeతెలంగాణPresident | ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది

President | ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది

  • హకీంపేటలో ఘనంగా వీడ్కోలు పలికిన గవర్నర్, సిఎం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ శీతాకాల పర్యటన ముగిసింది.. హకీంపేట్‌ ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌ లో గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మతో కలిసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వీడ్కోలు పలికారు. రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన వారిలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి,మంత్రి సీతక్క , ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, ఉన్నతాధికారులు ఉన్నారు. దాదాపు ఆరు రోజులపాటు ముర్ము హైదరాబాద్‌లో బస చేశారు. ఈ నెల 17న హైదరాబాద్‌ చేరుకున్న ఆమె.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

19న రామోజీఫిల్మ్‌సిటీలో నిర్వహించిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్‌పర్సన్ల జాతీయ సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 20న గచ్చిబౌలిలో బ్రహ్మకుమారీస్‌ శాంతిసరోవర్‌ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 21న రాష్ట్రపతి నిలయంలో ఎట్‌ హోమ్‌ నిర్వహించారు. ఆరు రోజుల శీతాకాల విడిది ముగించుకున్న రాష్ట్రపతి..ప్రత్యేక విమానంలో దిల్లీ పయనమయ్యారు. ఆమెకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర కిషన్‌రెడ్డి తదితరులు వీడ్కోలు పలికారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News