గోయజ్ సిల్వర్ జ్యూలరీ షోరూం ప్రారంభం
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం(Bhimavaram)లో సినీ నటి (Cine Actress) నేహా శెట్టి (Dj Tillu Fame) సందడి చేశారు. పట్టణంలోని జేపీ రోడ్డులో ఏర్పాటుచేసిన గోయజ్ సిల్వర్ జ్యూలరీ షోరూమ్(Goyaz Silver Jewellery Showroom)ను ప్రారంభించారు. తనకు వడ్డాణం అంటే ఎంతో ఇష్టమని, ఇక్కడి వడ్డాణం కలెక్షన్స్ చూస్తుంటే అన్నీ తీసేసుకోవాలనిపిస్తున్నట్లు చెప్పారు. షోరూమ్‌ను ప్రారంభించటం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సంస్థకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో 19 స్టోర్లు ఉండగా భీమవరంలో 20వ స్టోర్ ప్రారంభించారు.

యువతులు అందంగా కనిపించేందుకు ఈ జ్యూలరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేహా శెట్టి పేర్కొన్నారు. ఈ షోరూంలో మంచి సిల్వర్ జ్యూలరీ కలెక్షన్లు ఉన్నాయని తెలిపారు. నిర్వాహకులు రవితేజ వేములూరి, ప్రియాంక వేములూరి మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు పొందిన ఏకైక సిల్వర్ జ్యూలరీ స్టోర్ గోయాజ్ అని, వెండి ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు.


