Sunday, February 22, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంEncroachment | ప్రభుత్వ భూమిలో మెయిన్ లాండ్ టెక్నాలజీస్

Encroachment | ప్రభుత్వ భూమిలో మెయిన్ లాండ్ టెక్నాలజీస్

నిర్మాణ సంస్థ మాయాజాలం..

  • వేల కోట్ల విలువైన భూమిని దర్జాగా కబ్జా చేస్తున్న అక్రమార్కులు..
  • రెవెన్యూ రికార్డులనే తారుమారు చేసిన వైనం..
  • మూసాపేటలో ఐడిపీఎల్‌ భూములలో అడ్డగోలు దోపిడీ
  • సర్వే నెంబర్‌ మార్చి బోగస్‌ సర్వే రిపోర్టుతో మెయిన్‌ ల్యాండ్‌ టెక్నాలజీస్‌కు సహకరించిన ఏ.డి. శ్రీనివాసులు..
  • ఇటీవలే ఏసీబీకి కూడా పట్టుబడ్డ అవినీతి అధికారి ఏ.డి. శ్రీనివాసులు..
  • భారీ ఎత్తున ముడుపులు తీసుకొని అడ్డ దారిలో అనుమతులిచ్చిన జిహెచ్‌ఎంసి సిటీ ప్లానర్‌ రాజేంద్రప్రసాద్‌ నాయక్‌..
  • కూకట్‌ పల్లి మండల తహశీల్దార్‌ కార్యాలయ కేంద్రంగా రికార్డులు టాంపరింగ్‌ చేసిన దుర్మార్గం..
  • ఈ వ్యవహారంలో చక్రం తిప్పిన ఏ.డి. శ్రీనివాసులుతో పాటు మిగిలిన అధికారులపై ఏసీబీ విచారణ చేపట్టాలని పలువురి డిమాండ్‌..
  • తొలుత ఖాతా నెంబర్‌ 160 లోని సింథటిక్‌ ఫ్యాక్టరీ పేరుతో ఉన్న భూమిని వక్ర మార్గంలో 314 ఖాతాకు మార్పిడి చేసిన దుర్మార్గం..
  • మరల ఖాతా నెంబర్‌ 314 నుండి నొషనల్‌ ఖాతాకు మార్చిన అక్రమార్కులు..
  • నోషనల్‌ ఖాతాలో ఉన్న ప్రభుత్వ భూమిని అడ్డదారిలో నకిలీ పత్రాలతో మ్యుటేషన్‌ చేసిన అవినీతి అధికారి..
  • సర్వే నెంబర్‌ 210/2, 210/3లను భూచిగా చూపుతూ 210/4 లో భారీ నిర్మాణ పనులు చేపట్టిన నిర్మాణ సంస్థ..

వారు ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకున్నారు… అయితే నిజాయితీగా పని చేయాల్సిన వారు అడ్డదారులు తొక్కుతూ ఉండడం గర్హనీయం.. ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోక, అక్రమ మార్గంలో లక్షలు కూడబెట్టాలని కాంక్ష ఏదైతే ఉందో దానితో వారు అవినీతిపరులుగా మారిపోతున్నారు.. నిజానికి ప్రభుత్వ భూమి అంటే అది ప్రజల భూమి కింద లెక్క.. ఇక ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటున్న అధికారులు కొందరు..ఆ ప్రజలకే తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు.. తమ మేధస్సును ఉపయోగించి చట్టానికి దొరక్కుండా రకరకాలుగా అవినీతి కార్యకలాపాలు చేస్తున్నారు.. అక్రమార్కులు వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి వారికి నచ్చినట్లు.. వారికి ఉపయోగపడే విధంగా రికార్డులను తారుమారు చేస్తూ వారికి తమ వంతు సహాయం అందజేస్తున్నారు.. అలాంటి అవినీతి అధికారులను ఏమి చేయాలి..? కఠినంగా శిక్షించి మరొకరు అలాంటి ఆలోచన చేయాలంటేనే భయపడేలా చేయాలి.. కానీ అలా జరుగుతోందా..? మరి మన చట్టాలు న్యాయస్థానాలు ఉన్నతాధికారులు ఏమి చేస్తున్నారు..? అందరూ అవినీతి కోపంలో మునిగిపోయి విధులు నిర్వహిస్తున్నారు అన్నది అక్షర సత్యం,, ఇప్పుడు కూడా అదే జరిగింది ఐడిపిఎల్‌ కు సంబంధించిన భూములను అడ్డగోలుగా ఆక్రమించిన చరిత్ర ఇప్పుడు విూకోసం..

- Advertisement -

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా, కూకట్‌ పల్లి మండలం, మూసాపేట గ్రామ శివారులో సర్వేనెంబర్‌ 210/2లో ఐదు ఎకరాల 22 గుంటల విస్తీర్ణం కలిగిన భూమి కలదు..అదేవిధంగా సర్వేనెంబర్‌ 210/3 లో 2 ఎకరాల 18 గుంటల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమి ఉన్నట్లు ప్రస్తుత రెవెన్యూ రికార్డు స్పష్టం చేస్తుంది.. ఇట్టి సర్వే నెంబర్లు గల భూమిని బాలానగర్‌ మండలం, బాలానగర్‌ గ్రామ శివారులో సర్వే నెంబర్‌ 27 సర్వే నెంబర్‌ 28 గా ఉండడంతో రెండు గ్రామాల సరిహద్దులో ఓవర్‌ ల్యాప్‌ జరిగినట్లు రెవెన్యూ రికార్డులు తేటతెల్లం చేస్తున్నాయి..ఇట్టి విషయంలో అధికారులు ఓవర్‌ ల్యాప్‌ ఐన సర్వే నెంబర్‌ 210/2, 210/3 లను జి.హెచ్‌.ఏం.కి మాస్టర్‌ ప్లాన్‌ లో తొలగించారనేది మాస్టర్‌ ప్లాన్‌ బట్టి తెలుస్తోంది..

దీనితో సదరు సర్వే నెంబర్‌ 210 పేరుతో భూ బదలాయింపు చేయడానికి వీలులేని భూమిగా 500 ఎకరాలు ప్రభుత్వ భూమిని నిర్దారణ చేస్తూ.. నిషేధిత జాబితా 22(ఏ) లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ రికార్డులు చెబుతున్నాయి. ఇందులో నుండి రెవెన్యూ అధికారులు మెయిన్‌ ల్యాండ్‌ టెక్నాలజీస్‌ అనే నిర్మాణ సంస్థ వేసిన ఎంగిలి మెతుకులకు ఆశపడి ఐడిపిల్‌ భూమిని 1997` 98 పహానిలో అక్రమంగా పేర్లు నమోదు చేశారు.. ఇక్కడే అడ్డంగా దొరికిపోయారు అధికారులు,ల్యాండ్‌ గ్రాబర్స్‌.. ఇలా అక్రమంగా పేర్లు పట్టా కాలంలో నమోదు చేశారు..

కానీ సింథటిక్‌ ఫ్యాక్టరీకి కేటాయించిన ఖాతా నెంబర్‌ 160ని మార్చడం మరిచిపోయారు భూ బకాసురులు.. వేల కోట్లు విలువైన భూమిని కాజేయుటకు రికార్డులు టాంపరింగ్‌ చేశారు.. రెవెన్యూ రికార్డులను లోతుగా పరిశీలిస్తే 210 లోని 500ల ఎకరాల ప్రభుత్వ భూమి నుండి 21 ఎకరాల 05 గుంటల భూమికి బై నెంబర్‌ 210/1/1 గా మార్చారు అధికారులు.. ముసాపేట గ్రామ శివారులో ఉన్న 210/2 సర్వే నెంబర్‌ స్థానంలో బాలానగర్‌ గ్రామ సర్వే నెంబర్‌ 28, ముసాపేటలోని సర్వే నెంబర్‌ 210/3 ఓవర్‌ ల్యాప్‌ కావడంతో బాలానగర్‌ లోని సర్వే నెంబర్‌ 27గా మాస్టర్‌ ప్లాన్‌లో ఈ రెండు సర్వే నెంబర్లను పొందపరిచారు..

గత ప్రభుత్వంలో అధికారం అడ్డుపెట్టుకొని పహానిలో లేని పేర్లను రాసుకుని, ధరణిలో అక్రమంగా మ్యుటేషన్‌ చేసుకున్నారు మెయిన్‌ ల్యాండ్‌ టెక్నాలజీస్‌ నిర్మాణ సంస్థ అక్రమార్కులు.. ఇటీవలే ఏసీబీ కి ట్రాప్‌ అయిన సర్వే శాఖలో పనిచేస్తున్న ఏ.డి శ్రీనివాసులు..ఇలా తమ గుప్పిట్లో ఐడీపీఎల్‌ భూమిని పెట్టుకొని మాస్టర్‌ ప్లాన్‌లో సైతం లేని ఓవర్‌ ల్యాప్‌ అయిన సర్వే నెంబర్‌ 210/2, 210/3 ఉన్నట్లుగా చూపుతూ మెయిన్‌ ల్యాండ్‌ టెక్నాలజీస్‌ నిర్మాణ సంస్థకు బోగస్‌ సర్వే రిపోర్టు ఇచ్చి కోట్ల కొల్లగొట్టారు..

ఈ వ్యవహారంలో భాగస్వాములైన జిహెచ్‌ఎంసి సిటీ ప్లానర్‌ గా విధులు వెలుగబెట్టిన రాజేంద్ర ప్రసాద్‌ నాయక్‌ సైతం భారీ ఎత్తున ముడుపులు తీసుకొని సర్వే నెంబర్‌ 210/4 లో ఉన్న భూమిలో అక్రమంగా అనుమతులు మంజూరు చేసి చేతులు దులుపుకున్నారు అన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.. మున్సిపల్‌ శాఖలో అనుమతులు ఇచ్చే సమయంలో మాస్టర్‌ ప్లాన్‌ చూసి అందులో నుండి ఏమైనా రోడ్లు కానీ, చెరువు కాని, ప్రభుత్వ భూమి కానీ ఉందా అని చూసిన తర్వాత అనుమతులు మంజూరు చేస్తారు అధికారులు.. మాస్టర్‌ ప్లాన్‌ లో లేని సర్వే నెంబర్లకు నకిలీ పత్రాలు సృష్టించారనీ కళ్లెదుటే కనపడుతున్నా..

కాసులకు కక్కుర్తి పడి కబ్జాదారులకు వత్తాసు పలికి అడ్డదారిలో అనుమతులు మంజూరు చేయడంపై మండి పడుతున్నారు ఈ ప్రాంత ప్రజలు.. ఇలా మోకాపై లేని సర్వే నెంబర్లతో అక్రమంగా నిర్మాణ అనుమతులు తెచ్చుకొని.. ప్రాథమికంగా మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ముసాపేట లోని 210/4లో నిర్మాణ పనులు చేపట్టి కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొల్లగొడుతున్న మెయిన్‌ ల్యాండ్‌ టెక్నాలజీస్‌ నిర్మాణ సంస్థపై దుమ్మెత్తి పోస్తున్నారు స్థానిక ప్రజలు.. సదరు సంస్థ యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని పలువురు సామాజికవేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు..

లేని సర్వే నెంబర్‌ లతో 210/4 సింథటిక్‌ ఫ్యాక్టరీ పేరుతో ఉన్న ఐడిపిఎల్‌ భూమిని దర్జాగా కబ్జా చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న వ్యవహారం పై అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి సారిస్తే కల్లు బైర్లు కమ్మే నిజాలు బట్టబయలు అవుతాయని స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.. రెవెన్యూ శాఖలో ఖాతా నెంబర్‌ 160 నుండి 314 కు మార్చడం.. సింథటిక్‌ ఫ్యాక్టరీ పేరు నుండి మరల ఇట్టి భూమిని నోషనల్‌ ఖాతా నెంబర్‌ 20000101 కి ప్రభుత్వ భూమిగా మార్చడం, తరువాత అక్రమంగా ప్రభుత్వభూమి నుండి పట్టాగా మార్చు కోవడంపై మెయిన్‌ ల్యాండ్‌ టెక్నాలజీస్‌ నిర్మాణ సంస్థ చేస్తున్న కబ్జాపై..

ఈ వ్యవహారంలో భాగస్వాములైన రెవెన్యూ, మున్సిపల్‌, రిజిస్ట్రేషన్‌ అధికారుల అక్రమ వ్యవహారంపై, ఏ.డి. శ్రీనివాస్‌ చేసిన అంతులేని అక్రమంపై, ఏడి శ్రీనివాసులుతో చేతులు కలిపి ఏసీబీ అధికారులకు చిక్కకుండా ఉన్న అవినీతి అధికారుల అక్రమాలను వాస్తవాలు ఆధారాలతో సహా మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది

ఆదాబ్‌ హైదరాబాద్‌… మా అక్షరం అవినీతిపై అస్త్రం..

- Advertisement -
RELATED ARTICLES

Latest News