ఆసియా ఖండం(Asia Continent)లోనే అతిపెద్ద గిరిజన జాతర (Largest Tribal Fair) మేడారానికి అభివృద్ధి తోరణం కడుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు. సమ్మక్క సారలమ్మ (Sammakka Saralamm) అమ్మవార్ల ఆశీర్వాదంతో శాశ్వత నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు వెల్లడించారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని, గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా రూ.250 కోట్లకు పైగా నిధులతో శాశ్వత అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, వందల ఏండ్లుగా వస్తున్న, కోట్లాది భక్తుల కొంగు బంగారం శ్రీ సమ్మక్క, సారలమ్మ గద్దెల పునర్నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. ఘనమైన చరిత్రకు ఘననీయమైన అభివృద్ది.. మేడారం వైభవం.. రమణీయం.. పునర్నిర్మాణం.. అని వివరించారు.
