ప్రపంచంలోని అగ్రగామి బీర్ తయారీ సంస్థ.. ఐసీసీ అధికారిక బీర్ భాగస్వామిగా అవతరించింది
ప్రపంచంలోని ప్రముఖ బ్రూవర్ అయిన ఏబీ ఇన్బెవ్(AB InBev).. 2026 నుంచి ప్రారంభమయ్యే అన్ని ప్రధాన ఐసీసీ టోర్నీ(ICC Torney)లకు అధికారిక బీర్ భాగస్వామి(Official Beer Partner)గా మారుతుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది. ఈ పార్ట్నర్‌షిప్‌కు మన దేశంలో ఆల్కహాల్ లేని బీర్ బడ్‌వైజర్(Budweiser)0.0 నాయకత్వం వహిస్తుంది. ఇతర ఏబీఐ మెగా బ్రాండ్‌లు యూరప్, ఆఫ్రికాలో ఈ భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేయనున్నాయి.
స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ చూడటం నుంచి, స్నేహితులతో కలిసి బార్ లేదా పబ్‌లో మ్యాచ్ వీక్షించడం వరకు.. తక్కువ ఆల్కహాల్ శాతం (ABV) కలిగిన బీర్లు, అలాగే బడ్‌వైజర్0.0 వంటి నాన్-అల్కహాలిక్ (Non-Alcoholic) ఎంపికలతో బీర్‌ను ఆస్వాదించేందుకు సహజ ఎంపికగా భావిస్తారు. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా చట్టపరమైన మద్యపాన వయసు గల క్రికెట్ అభిమానుల(Cricket Fans)కు ఇంకా ఎక్కువ ఆనంద క్షణాలు, ఎంపికల విస్తృతి, సంబరాలను ఏబీ ఇన్బెవ్, ఐసీసీ కలిసి అందించనున్నాయి.
ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది అభిమానించే క్రీడల్లో క్రికెట్ ఒకటి. 2 బిలియన్లకు పైగా అభిమానులను కలిగి ఉంది. ఐసీసీ ఈవెంట్లు ఈ అభిమానానికి అతిపెద్ద వేదికలు. అదే సమయంలో.. ఏబీ ఇన్బెవ్ అభిమానులను పెంచేందుకు, వారి అనుభవాలను మరింత లోతుగా మార్చేందుకు వినూత్న చర్యల్లో ముందంజలో ఉంది.
ఈ భాగస్వామ్యం అనేది కాలాన్ని ఉన్నతంగా మార్చడం, గుర్తుండిపోయే అనుభవాలు సృష్టించడం, అభిమానుల అనుసంధానానికి నూతన మార్గాల ద్వారా అనుభవాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్న రెండు సంస్థల మధ్య సహజ ఏకీకరణ. ఐసీసీ ప్రతిష్టాత్మక కమర్షియల్ భాగస్వాముల జాబితాలో ఏబి ఇన్బెవ్‌ను స్వాగతిస్తున్నాం. మా టోర్నమెంట్లలో బహు-విధాన ఈవెంట్ అనుభవాలను కలిసి అందించడానికి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ క్రీడపై ఉన్న ఉత్సాహాన్ని మరింతగా పెంచేందుకు ఎదురుచూస్తున్నాం.
ఏబీ ఇన్భెవ్ అధ్యక్షుడు కార్తికేయ శర్మ మాట్లాడుతూ.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌తో మా భాగస్వామ్యాన్ని ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉంది. గత రెండు దశాబ్దాలుగా భారత్‌లో బడ్‌వైజర్ వేడుకలు హృదయంలో నిలిచాయి. దేశంలోని అగ్రశ్రేణి ప్రీమియం బీర్ బ్రాండ్‌గా కోట్లాది మందిని ఏకం చేసే ఈ క్రీడతో మా సంబరాల ప్యాషన్‌ను కలపడానికి ఇదే సరైన సమయం.
క్రీడా మైదానాల్లో మారుమోగే గర్జన నుంచి ఇళ్లల్లో వినిపించే చీర్‌ల వరకు ప్రతి క్రికెట్ ఆనందాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లడం మా అభిలాష. ఆటను ఐకానిక్‌గా మార్చే అభిమానులపై వెలుగులు పడేలా చేయడమే మా లక్ష్యం. ఐసీసీతో కలిసి క్రికెట్ సంబరాలను బడ్‌వైజర్‌కు ప్రత్యేకమైనవిగా మార్చే ప్రపంచ స్థాయి అనుభవాలను అందించబోతున్నాం. గర్వంగా, బాధ్యతాయుతంగా, ఎల్లప్పుడూ క్షణాన్ని ముఖ్యమైనంగా చేసే వారి చేతుల్లోనే.
ఈ భాగస్వామ్యంలో 2027 వరకు జరిగే అన్ని ప్రధాన ఐసీసీ పురుషుల, మహిళల ఈవెంట్లు చేర్చబడ్డాయి. వాటిలో ఐసీసీ మెన్స్ టీ20, 2026 ప్రపంచ కప్ భారత్, శ్రీలంకలో, ఐసీసీ ఉమెన్స్ టీ20.. 2026 ప్రపంచ కప్ యూకేలో, ఫస్ట్ ఐసీసీ ఉమెన్స్ ఛాంపియన్స్ టోప్రీ, 2027 శ్రీలంకలో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ 2027 ఇంగ్లాండ్‌లో, ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2027 సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నామీబియాలో జరుగుతుంది.
