- క్రిస్టియానో రొనాల్డోకు కెరీర్ లో చివరిమ్యాచ్..
- అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రపంచ అభిమానులు..
ఫిఫా ప్రపంచకప్ 2026లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన పోర్చ్‌గల్ మొదటి మ్యాచ్‌లోనే అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోకు కెరీర్‌లో ఇదే చివరి వరల్డ్ కప్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతడి అభిమానులు రొనాల్డో ఆటపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆల్ టైమ్ అత్యుత్తమ క్రీడాకారులలో ఒకరైన రోనాల్డో బుధవారం జరిగిన ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్‌లో డీఆర్ కాంగోతో పోర్చుగల్ డ్రాతో సరిపెట్టుకోవడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు.
పోర్చుగల్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న 41 ఏండ్ల రొనాల్డో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోడంతో అంతర్జాతీయంగా 143 గోల్స్ చేసి రికార్డు సృష్టించిన ఈ దిగ్గజం ఆటతీరుపై క్రీడా విశ్లేషకులతో పాటు అభిమానులు అతడి ఆట తీరుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు అతడిని జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారనే స్థాయి వరకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రొనాల్డో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో తన కెరీర్ చివరి దశలో దాదాపు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్న ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మూడేళ్ల క్రితం ప్రపంచానికి చెప్పిన మాటలు ఈ సందర్భంగా ప్రాధాన్యం సంచరించుకున్నాయి.
