Thursday, February 12, 2026
Homeస్పోర్ట్స్Lionel Messi | మెస్సీతో ఒక్క ఫొటోకి 10 లక్షలు

Lionel Messi | మెస్సీతో ఒక్క ఫొటోకి 10 లక్షలు

ఆ ఛాన్స్ కూడా వంద మందికి మాత్రమే

అర్జెంటీనా (Argentina) ఫుట్‌బాల్ (Football) లెజెండ్ ప్లేయర్ (Legend Player) లియోనెల్ మెస్సీ ఈ నెల 13న శనివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఫలక్‌నుమా ప్యాలెస్‌(Falaknuma Palace)లో మెస్సీతో మీట్ అండ్ గ్రీన్ (Meet and Greet) అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఆయనతో ఒక్క ఫొటో దిగాలంటే 10 లక్షల రూపాయలు (Ten Lakhs For One Photo) చెల్లించాలి.

- Advertisement -

అది కూడా వంద మందికి మాత్రమేనని నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించిన టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్‌లో ఉన్నాయని చెప్పారు. ‘ది గోట్ టూర్’(The Goat Tour)లో భాగంగా హైదరాబాద్‌లో ఒక్క రోజు పర్యటించనున్న మెస్సీ.. ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో జరిగే ఈవెంట్‌లో గంట సేపు ఉంటారు. 20 నిమిషాల పాటు ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడతారు. అందులో చివరి ఐదు నిమిషాలు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) పాల్గొంటారు. మ్యాచ్ అనంతరం మెస్సీని సీఎం రేవంత్ సన్మానిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News