ఈ ఏడాది ప్రపంచవ్యాప్తం(WorldWide)గా జంతువుల అక్రమ రవాణా రికార్డ్ స్థాయి(Record Level)లో చోటుచేసుకుంది. ఇతర దేశాల పెంపుడు జంతువులకు (Pet Animals) డిమాండ్ (Demand) పెరగడమే దీనికి కారణం. దీనివల్ల 2025లో అత్యధిక సంఖ్యలో జంతువుల స్వాధీనం నమోదైంది. దాదాపు 30 వేల జంతువుల అక్రమ రవాణాను అడ్డుకున్నట్లు ఇంటర్‌పోల్ పోలీసు ఏజెన్సీ (Interpol Police Agency) గురువారం తెలిపింది. వన్యప్రాణుల (Wildlife) నేరాల విలువ (Crimes Value) ఇప్పుడు ఏటా 20 బిలియన్ డాలర్లకు పైగా నెలకొంది.
వేల సంఖ్యలో షార్క్ చేపల నుంచి నిషేధిత దంతాలు, ప్రైమేట్ మాంసం వరకు నేరాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి నెల రోజుల పాటు 134 దేశాల్లో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించగా ఈ విషయాలు వెలుగు చూశాయి. 6160 పక్షులు, 2040 తాబేళ్లు, 1150 సరీసృపాలు, 208 ప్రైమేట్‌లు, 46 పాంగోలిన్‌లు, 10 బిగ్ క్యాట్లు, 19415 ఇతర అడవి జంతువులను స్వాధీనం చేసుకున్నట్లు ఇంటర్‌పోల్ ఓ ప్రకటనలో తెలిపింది. దాదాపు 1100 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
