Wednesday, March 4, 2026
Homeమహబూబ్‌నగర్‌ఆంధ్ర నుండి తెలంగాణకు విముక్తి కలిగించిన మహనీయురాలు.

ఆంధ్ర నుండి తెలంగాణకు విముక్తి కలిగించిన మహనీయురాలు.

  • పిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య..

ఆంధ్ర పాలన నుండి తెలంగాణ విముక్తి కలిగించిన మహనీయురాలు సోనియాగాంధీ అని పిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య పేర్కొన్నారు. మంగళవారం సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఆదేశాల మేరకు వారి స్వగృహంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి, సోనియాగాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల బలిదానాలకు చలించిపోయిన సోనియా గాంధీ అన్ని పార్టీల నాయకులను ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరించి ఆంధ్ర నుండి తెలంగాణకు విముక్తి కలిగించిన మహనీయురాలని కొనియాడారు. ఈ వేడుకలో జిల్లా మాజీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్దన్, మైనార్టీ నాయకులు కమర్ మీయా, అక్తర్, పట్టణ మాజీ అధ్యక్షులు కిరణ్ కుమార్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరి రాములు యాదవ్, అంజి రెడ్డి, అనీష్, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎండి బాబా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News