కేంద్ర ప్రభుత్వ నిధుల(Central Government Funds)తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు (Bjp State Leader) పగడాల కాళీప్రసాద్ రావు (Pagadala Kaliprasad Rao) అన్నారు. బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తేనే పల్లెలు ప్రగతి బాటలో ముందుంటాయని చెప్పారు. ఈ మేరకు ఆయన పరకాల నియోజకవర్గం నడికూడా మండలం వెంకటేశ్వరపల్లిలో బీజేపీ మద్దతిచ్చిన సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల కోసం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం (Gram Panchayat Election Campaign) నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ అభ్యర్థి వంగా మల్లికార్జున్, వార్డ్ మెంబర్స్ మోత్కూరి లక్ష్మీ-రమేష్, వంగ శరణ్య–మల్లికార్జున్, కోట తిరుపతి, ఎరుకల రాజారెడ్డి, మందోటి విజయేందర్, చేకిలె జామున-రవీందర్‌లకు మద్దతుగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ.. బీజేపీ సపోర్ట్ చేసిన అభ్యర్థి వంగ మల్లికార్జున్ బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఆయన వెంట 56వ డివిజన్ అధ్యక్షుడు మహేందర్ పటేల్, సీనియర్ నాయకులు పెంతల జగన్, ఎరుకల శ్రీనివాస్, ఆకుల రాజు, మందుటి మహేందర్, కోట మల్లయ్య, కోట రవి శంకర్, లింగం, భిక్షపతి, అంజి, ఆకుల నవీన్, ఎల్లస్వామి, గోనె రాకేష్, గోనె రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాళీప్రసాద్ రావు.. పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.
