Thursday, February 12, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baat | సమన్యాయ పాలనకు చోటివ్వండి

Aaj Ki Baat | సమన్యాయ పాలనకు చోటివ్వండి

అభ్యర్థి (Candidate) ఏ పార్టీ వాడో కాదు.. ఏ పాటి వాడొ చూసి ఓటేయాలన్నారు కాళోజీ(Kaloji). పాలిటిక్స్ (Politics) అంటే ప్యాషన్ ఉందనో, పబ్లిసిటీల (Publicity) కోసమో కాదు. పాలిటిక్స్ అంటే ప్రజాస్వామ్య పాలన. ప్రజా పాలన చేసేటోడే అసలైన నాయకుడు(Leader). బందోబస్తు పెట్టుకొని వచ్చేటోడు కాదు. భరోసానిచ్చేవాడే ప్రజా నాయకుడు. నోట్లిచ్చి గెలిచినోడు కాదు. నిత్యం ప్రజాసేవ చేసిటోడు నిజమైన నాయకుడు. బాధ్యతాయుతమైన అభివృద్ధి(Development)ని వదిలి పథకాల కోసమో అబద్ధపు హామీల కోసమో నమ్మకండి. కొన్నొద్దుల ప్రచారాల మోజుతో కల్లిబొల్లి కబుర్ల ఉచ్చులో పడి ఓ పూటకిచ్చిన బిర్యానీ కోసం ఐదేండ్లకి అందాల్సిన హక్కులను కాలరాయకండి. నీ ఓటు నీ ఉనికి. నీ ఓటే నీ ఆయుధం. ఓ ప్రజలారా ! సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోండి. సమన్యాయ పాలనకు చోటివ్వండి.

  • కాల్వ నిఖిత
- Advertisement -
RELATED ARTICLES

Latest News