సాయిచరణ్, ఉషశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఇట్స్ ఓకే గురు’. మణికంఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రాంతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఈ నెల 12న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ మెహర్ రమేష్ (Director Meher Ramesh) మాట్లాడుతూ.. ‘‘నేను.. ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ (Itlu Sravani Subramaniam) సినిమాకి పూరి జగన్నాథ్ (Puri Jagannath) దగ్గర అసిస్టెంట్‌గా చేశాను. బడ్జెట్‌తో సంబంధం లేకుండా సబ్జెక్ట్‌ని నమ్మి చేసిన సినిమా అది. ఆ సినిమా తర్వాత రవితేజ(Raviteja), పూరి జగన్నాథ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇట్స్ ఓకే గురూ సినిమా చూస్తున్నప్పుడు నాకు ఇందులో మంచి సబ్జెక్టు ఉన్నట్లు అనిపిస్తుంది. డైరెక్టర్ మణికంఠతోపాటు టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.
చిన్న సినిమాలు చాలా అద్భుతంగా ఆడుతున్నాయి. ఈ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ. ఇందులో ఒక సాంగ్ నాకు చాలా నచ్చింది. మణికంఠ తీసిన కొత్త పెళ్లికూతురు షార్ట్ ఫిలిం నాకు చాలా ఇష్టం. ఈ సినిమాని కూడా చాలా కష్టపడి మంచి సబ్జెక్టు రాసుకొని తీశాడు. మేం కలిసి త్వరలోనే ఒక వెబ్ సిరీస్ కూడా చేయాలని ఉంది. ఈ సినిమా హీరో చరణ్‌లో చాలా మంచి ఈజ్ ఉంది. అతని పర్ఫామెన్స్ నాకు చాలా నచ్చింది. చరణ్, మణికంఠ కాంబినేషన్లో మరో సినిమా రావాలని కోరుకుంటున్నా’ అని చెప్పారు.
