Tuesday, March 3, 2026
Homeమెదక్‌Harish Rao | సాయి ఈశ్వర్ చారి కుటుంబాన్ని ఆదుకోవాలి

Harish Rao | సాయి ఈశ్వర్ చారి కుటుంబాన్ని ఆదుకోవాలి

బీసీ రిజర్వేషన్ల(BC Reservations) పేరిట సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆడిన రాక్షస రాజకీయ క్రీడ(Political Game)లో తమ్ముడు సాయి ఈశ్వర్ చారి (Sai Eshwar Chari) బలైపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట్ ఎమ్మెల్యే (Siddipet Mla) హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ బిడ్డ ఆత్మబలిదానానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని (Congress Government) బీసీ సమాజం ఎన్నటికీ క్షమించదని హెచ్చరించారు.

ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హ*నని మండిపడ్డారు. రేవంత్ అధికార దాహానికి బలైన ప్రాణం ఇది అని నిప్పులు చెరిగారు. సాయి ఈశ్వర్ ఆత్మకు శాంతి కూరాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా (Ex-Gratia) ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ (Brs Party) పక్షాన డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News