UPSC సివిల్ సర్వీసెస్ (Civil Services) ఇంటర్వ్యూ (Interview) దశకు ఎంపికైన 50 మంది అభ్యర్థులకు డిప్యూటీ సీఎం (Deputy CM) మల్లు భట్టి విక్రమార్క(Mallu BhattiVikramarka).. ప్రజాభవన్‌లో ఒక్కొక్కరికి 1 లక్ష చొప్పున పంపిణీ చేశారు. మెయిన్స్ లేదా ఇంటర్వ్యూలకు అర్హత సాధించిన ప్రతి అభ్యర్థికి (సంఖ్యపై పరిమితి లేకుండా) ప్రభుత్వ ఆర్థిక మద్దతు లభిస్తుందని ప్రకటించారు. మెయిన్స్ అర్హత సాధించినవారికి రూ.లక్ష, ఇంటర్వ్యూకి అర్హత సాధించినవారికి రూ.లక్ష + ఢిల్లీలో వసతి కల్పిస్తామని చెప్పారు.
ఈ సంవత్సరం 202 మంది మెయిన్స్‌ను క్లియర్ చేయగా 50 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ్ హస్తం (Rajiv Gandhi Civil Abhay Hastam) పథకం కింద సింగరేణి (Singareni) సంస్థ CSRలో భాగంగా ఈ సాయం చేస్తోంది. సమాజానికి సమగ్రతతో సేవ చేయాలని భట్టి ఈ సందర్భంగా కోరారు. మార్గదర్శకత్వం కోసం సీనియర్ అధికారులతో ఇంటర్వ్యూ బోర్డును ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, సింగరేణి CMD బలరాం, ఆ సంస్థ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
