Friday, February 13, 2026
Homeనిజామాబాద్‌Jeevan Reddy | వినయ్ కుమార్ రెడ్డి బెదిరింపులకు భయపడను

Jeevan Reddy | వినయ్ కుమార్ రెడ్డి బెదిరింపులకు భయపడను

– నా అంతు చూస్తావా? ఇప్పుడు మునిసిపల్ ఆఫీసులోనే ఉన్నా.. దమ్ముంటే రా
– అన్ని ఆధారాలతో పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి(పీవీఆర్)పై నిర్దిష్టమైన ఆరోపణలు చేశా
– వాటికి సూటిగా జవాబు చెప్పకుండా నాపై వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటు
– మునిసిపల్ ఆఫీసులో సీసీ కెమెరాలు పెట్టే అధికారం నీకెవరిచ్చారు?
– ఏ అర్హత ఉందని ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నావు?
– అన్ని వర్గాల వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసే అధికారం నీకెవరిచ్చారు?
– ఆర్మూర్ నీ అయ్య జాగీరా? ఇక నీ ఆటలు సాగవు జాగ్రత్త
– నీ సీఎంకే భయపడను.. నువ్వెంత? నన్ను అనే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకో
– పీవీఆర్ వసూళ్ల దందాపై ప్రజలు తిరగబడాలి
– అధికారులూ.. పీవీఆర్ మాటలు విని జైళ్ల పాలు కాకండి
– బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వార్నింగ్
– పీ అంటే పైసా, వీ అంటే వసూల్, ఆర్ అంటే రెడ్డి. క్రైమ్ నం-2 అంటూ మండిపాటు

ఆర్మూరు (Armoor) నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ (Congress Party Incharge) పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి (PVR) బెదిరింపులకు తాను భయపడనని బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు(Nizamabad District President), ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే (Former Mla) ఆశన్నగారి జీవన్ రెడ్డి (Aasannagari Jeevan Reddy) స్పష్టం చేశారు. పీ–అంటే పైసా, వీ అంటే వసూల్, ఆర్ అంటే రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఇది పీవీఆర్ క్రైమ్ నం-2 అని అన్నారు. మునిసిపల్ ఆఫీసులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మరీ పీవీఆర్ సరికొత్త అవినీతికి తెరలేపారని ఆరోపించారు. పలువురు తన జనతా గ్యారేజ్‌లో ఫిర్యాదు చేశారని చెప్పారు. దీంతో తాను బుధవారం ఆర్మూర్ మునిసిపల్ ఆఫీసుకు వచ్చి పరిశీలిస్తే పీవీఆర్ ఏర్పాటుచేసిన వాయిస్ రికార్డింగ్ సీసీ కెమెరాలు కనిపించాయని జీవన్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

జీవన్ రెడ్డి.. ‘నమస్తే ఆర్మూర్-జనతా గ్యారేజ్’ కార్యక్రమంలో భాగంగా పీవీఆర్ క్రైమ్ నం-2గా అవినీతి బాగోతం చూపించడానికి ఆర్మూర్ పట్టణంలో మునిసిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. తనతో అనేక మంది బాధితులు మాట్లాడి వినయ్ కుమార్ రెడ్డి ధనదాహం గురించి కథలు కథలుగా చెప్పారని అన్నారు. తనను ఉద్దేశించి వినయ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జీవన్ రెడ్డి భగ్గుమన్నారు.

‘నా అంతు చూస్తావా? ఇప్పుడు మునిపల్ ఆఫీసులోనే ఉన్నా. దమ్ముంటే రా. చూసుకుందాం’ అంటూ జీవన్ రెడ్డి సవాల్ చేశారు. సమాచార హక్కు చట్టం ప్రకారం తెప్పించిన అన్ని ఆధారాలతో తాను పీవీఆర్‌పై నిర్దిష్టమైన ఆరోపణలు చేశానని, వాటికి పీవీఆర్ సూటిగా జవాబు చెప్పకుండా తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటని ఆయన నిప్పులు చెరిగారు. ‘మునిసిపల్ ఆఫీసులో సీసీ కెమెరాలు పెట్టే అధికారం నీకెవరిచ్చారు?. ఏ అర్హత ఉందని ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నావు?. ప్రజా ప్రతినిధివి కాదు కదా.. కనీసం ప్రభుత్వ చెప్రాసి కూడా కాదు. అన్ని వర్గాల వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసే అధికారం నీకెవరిచ్చారు?. ఆర్మూర్ నీ అయ్య జాగీరా?. ఇక నీ ఆటలు సాగవు. జాగ్రత్త. నీ సీఎంకే భయపడను. నువ్వెంత? నన్ను అనే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకో. పీవీఆర్ వసూళ్ల దందాపై ప్రజలు తిరగబడాలి’ అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

అధికారులూ.. పీవీఆర్ మాటలు విని జైళ్ల పాలు కాకండి అని హితవు పలికారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి మునిసిపల్ ఆఫీసులో పీవీఆర్ తన అవినీతి దందా కోసం ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. వినయ్ కుమార్ రెడ్డితో కుమ్మక్కయి ప్రజాధనం దోచుకుంటున్న పలువురు అధికారుల పేర్లు తన జనతా గ్యారేజ్‌లోని పింక్ బుక్‌లో రాస్తున్నానని హెచ్చరించారు. తమ ప్రభుత్వం రాగానే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీవన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్, మాజీ కౌన్సిలర్ చక్రు, సీనియర్ నాయకులు పోల సుధాకర్, రాజేశ్వర్ రెడ్డి, సుంకరి రవి, శ్యామ్, పృథ్వి, మీర శ్రావణ్, మహేష్, అజీమ్, మాలిక్ బాబా, అర్షద్, లతీఫ్, సైఫ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News