Wednesday, December 10, 2025
EPAPER
Homeస్పోర్ట్స్India | భారీ స్కోర్ చేసినా భారత్ ఓటమి

India | భారీ స్కోర్ చేసినా భారత్ ఓటమి

దక్షిణాఫ్రికా(South Africa)తో రాయ్‌పూర్‌(Raipur)లో జరిగిన రెండో వన్డే(Second One day)లో ఇండియా (India) భారీ స్కోర్ చేసినా ఓటమి (Defeat) తప్పలేదు. సౌతాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని దక్షిణఫ్రికా 49.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ని 1-1తో సమం (Equal) చేసింది. విరాట్ కోహ్లీ (Virat Kohli) 53వ సెంచరీ చేసినా ఆ ఆనందం నిలవకుండా పోయింది.

సౌతాఫ్రికా ఓపెనర్ మార్‌క్రమ్ (Markram) సైతం శతకం(Centuary)తో తమ దేశానికి విక్టరీని అందించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (Player Of The Match) అవార్డు పొందాడు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇండియా టీమ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) కూడా సెంచరీ చేసినప్పటికీ పరాజయం ఎదురుకావటం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మూడో మ్యాచ్ ఈ నెల 6న విశాఖలో జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News