గ్రామాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా
సేవకుడిలా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా
సర్పంచ్ అభ్యర్థి కాశమైన మహేష్ విజ్ఞప్తి
జగదేవపూర్, డిసెంబర్ 3(ఆదాబ్ హైదరాబాద్): తనకు ఓటేసి ప్రెసిడెంట్(President)ని చేస్తే గ్రామాన్ని అభివృద్ధి(Development)లో పరుగులు పెట్టిస్తానని గొల్లపల్లి (Gollapally) సర్పంచ్ అభ్యర్థి (Sarpanch Candidate) కాశమైన మహేష్ అన్నారు. ఒక్క అవకాశం కల్పిస్తే ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. సేవకుడి(Servant)లా పనిచేస్తానని చెప్పారు. తనను బలపరిచిన గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రి వివేక్ వెంకటస్వామి (Vivek venkataswami), జిల్లా అధ్యక్షుడు ఆంక్షరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, గజ్వేల్ మార్కెట్ (Gajwel Market) చైర్మన్ నరేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మండల వైస్ ప్రెసిడెంట్, గొల్లపల్లి మాజీ సర్పంచ్ నరసింహారెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ.. రూ.2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు, గృహజ్యోతి, పేదలకు సన్న బియ్యం, చీరలు, వడ్డీ లేని రుణాలు, సన్న ధాన్యానికి బోనస్ వంటి పథకాలను అమలుచేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదేనని అన్నారు. తనను గెలిపిస్తే గ్రామానికి నిధులు వచ్చేలా కృషిచేస్తానని తెలిపారు. అందరి సమస్యల పరిష్కారానికి, యువతకు ఉపాధి కల్పించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని మాటిచ్చారు. తనను ఆశీర్వదించి సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు.
