Wednesday, February 11, 2026
HomeజాతీయంDevavrat Mahesh | 50 రోజుల్లో 2వేల మంత్రాల పఠనం

Devavrat Mahesh | 50 రోజుల్లో 2వేల మంత్రాల పఠనం

  • కాశీ కుర్రాడు వేదమూర్తికి మోడీ ప్రశంసలు

19 ఏళ్ల పండితుడు వేదమూర్తి దేవావ్రత్ మహేశ్ రేఖీపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. దండక్రామ పారాయాణాన్ని పూర్తి చేసిన క్రమంలో ఆ కుర్రాడిని ప్రధాని మెచ్చుకున్నారు. శుక్ల యజుర్వేదంలోని మధ్యాంధినిలో ఉన్న సుమారు 2000 మంత్రాలను ఆ యువకుడు పారాయణం చేశారు. వరుసగా 50 రోజుల్లో ఆ మంత్రాలను అతను వల్లించాడు. ఇదో గొప్ప ఘనత అని ప్రధాని మోడీ తన ప్రశంసలో పేర్కొన్నారు. రాబోయే తరాలు ఈ అద్భుత ఘనతను గుర్తుంచుకుంటాయని అన్నారు. భారతీయ సంస్కృతి పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఆ కుర్రాడు సాధించిన ఘనతను గర్విస్తారన్నారు.

ఎటువంటి అవరోధాలు లేకుండా శుక్ల యుజుర్వేదంలోని 2 వేల మంత్రాలను ఆ యువకుడు పఠించినట్లు చెప్పారు. కాశీ నియోజకవర్గానికి చెందిన ఆ కుర్రాడు ఆ పవిత్ర పట్టణంలో అసాధారణ ఫీట్ను సాధించడం పట్ల సంతోషంగా ఉందని ప్రధాని అన్నారు. తన ఎక్స్ అకౌంట్లో మోడీ మెసేజ్ చేశారు. ఆ కుర్రాడికి సపోర్టు ఇచ్చిన కుటుంబసభ్యులకు, పండితులుకు, సంస్థలకు ప్రధాని థ్యాంక్స్ తెలిపారు. మరో వైపు హర్యానాలోని జాజర్ ఉన్న సిద్ధ బాబా పాల్నాథ్ ఆశ్రమాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సందర్శించారు. ప్రాణ ప్రతిష్ట, ఆత్మ భండార కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. సనాతన సంస్కృతి, మానవ పరిణామ క్రమంలో దాని ప్రభావాన్ని ఆయన తన ప్రసంగంలో తెలిపారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News